Rajinikanth ; ఆ మాటల్లో తప్పేముంది… అంతలా రజనీకాంత్ కూతురు ఏడవాల్సిన అవసరం ఏముంది?

రజనీకాంత్( Rajinikanth ) కూతురు స్వయంగా తాజాగా తన సినిమా అయిన లాల్ సలాం ఆడియో( Lal Salaam Audio ) ఫంక్షన్ వేదికగా కన్నీళ్లు పెట్టుకుంటూ తన తండ్రి గురించి మాట్లాడింది.

తన తండ్రిని సంఘీ అంటూ కొంతమంది ట్రోల్ చేయడానికి ఆమె తప్పు పట్టింది మా నాన్న అలాంటి వాడు కాదు.

అలా అయితే లాల్ సలాం సినిమాలో నటించేవాడు కూడా కాదు.పైగా మేము మా నాన్నను సినిమాలో నటించమని అడగలేదు.

కథ విన్న తర్వాత ఆయనే ముందుకు వచ్చి మోయిద్దీన్( Moiddin ) అనే పాత్రలో నటించారు.అలాంటి మా నాన్నను పట్టుకుని అనడం పట్ల ఆమె తీవ్రంగా ఖండించారు.

అయితే అసలు అర్థం కాని విషయం ఏమిటి అంటే సంఘీ అనే పదం అంత తప్పు అర్థం వచ్చేలా ఉందా? దీన్ని ఇంత తేడాగా ఎందుకు తీసుకుంటున్నారు.

Advertisement

సంఘీ అంటే హిందుత్వ భావజాలం ఉన్న వ్యక్తులు లేదా బిజెపి పార్టీకి ( BJP party )సంబంధించిన వ్యక్తులను ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తులను అలా పిలుస్తూ ఉంటారు.నాస్తికులు కమ్యూనిస్టు భావాలు ఉన్నవారు దీన్ని వాడుతుంటారు.ఆ పదం అన్నంత మాత్రాన అసలు తప్పేముంది అనేది పెద్ద ప్రశ్న దానికి రజనీకాంత్ కూతురు ఇంతలా ఏడవాల్సిన అవసరం ఏముంది అనేది మరో ప్రశ్న.

పోనీ రజనీకాంత్ ఎప్పుడు హిందూ భావజాలంతో కూడిన వ్యక్తి గానే ఉండటానికి ఇష్టపడలేదా అందుకే ఇలాంటి కామెంట్స్ చేయాల్సి వస్తుందా.అయినా ఎప్పుడు హిమాలయాలు అంటూ ఆధ్యాత్మిక చింతన తోనే ఉంటాడు కదా ? ఆ మాట అంత తప్పుతో కూడిన అర్థం వచ్చే విధంగా ఏమీ లేదు కూడా.అందుకే రజినీ కూతురు బాధపడటంలో అసలు అర్థం లేదు అని అనిపించింది.

అసలు రజనీకాంత్ ఎప్పుడూ రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తిగా వ్యవహరించలేదు.ఆయనకు ప్రజలకు ఏదైనా తిరిగి ఇవ్వాలన్న బాధ్యత కూడా లేదు.ఇంత వైభోగం ఈ రోజు ఆయనకు దక్కింది అంటే ఆ ప్రజల వల్లే సాధ్యమైంది కదా.ఆరోగ్యం సాకు చూపించి ఏళ్ల తరబడి ఇదిగో వస్తున్న అదిగో వస్తున్నా అంటూ చివరికి ఇక రాను అంటూ ప్రకటి చేశాడు.రజనీకాంత్ పై ఈ ట్రోలింగ్ మొదలవడానికి కారణం కొన్ని రోజుల ముందు అర్ధమైందా రాజా అంటూ ఒక వెటకారపు కామెంట్ చేయడం వల్లే మొదలైంది.

దీనిని తమిళనాడులో ఫాన్స్ అధికంగా ఉన్న విజయ్ కుమార్ పైనే అంటూ అప్పటి నుంచి ఆయన ఫ్యాన్స్ రజనీకాంత్ పై ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు.నేను విజయ్ ని ఉద్దేశించి ఆ మాట అనలేదు అంటూ రజనీ కూడా చెప్పడం విడ్డూరంగా అనిపించింది.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

ఇంతటి వ్యక్తులు అసలు వివరణలు ఇవ్వడంలో ఎలాంటి అర్థం కూడా లేదు.

Advertisement

తాజా వార్తలు