రాజ్యసభ సీట్లలో ప్రాంతీయ న్యాయం ఎందుకు జరగలేదు?

ఏపీలో రాజ్యసభ సీట్ల కేటాయింపు అంశం వివాదం రేపుతోంది.

ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్లలో రెండు రెడ్డి వర్గానికి, రెండు బీసీ వర్గానికి కేటాయించడం వరకు బాగానే ఉంది.

కానీ పక్క రాష్ట్రం వారికి ఏకంగా రెండు సీట్లు కేటాయించడమే వివాదానికి తెరతీసింది.దీంతో అటు అధికారపక్షంలోనూ, ఇటు ప్రతిపక్షంలోనూ విమర్శలు వినిపిస్తున్నాయి.

నిజానికి రాజ్యసభ సీటుపై వైసీపీలో ఏపీకి చెందిన చాలా మంది ఆశావహులున్నారు.కానీ జగన్ ఏపీ నేతలను విస్మరించి తెలంగాణ నేతలకు రెడ్ కార్పెట్ వేయడం వైసీపీ నేతలకే నచ్చలేదు.

రాజ్యసభ సీట్ల కేటాయింపులో ప్రాంతీయ న్యాయం ఎందుకు జరగలేదని పలువురు నేతలు తమలో తామే కుమిలిపోతున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా చిలకలూరిపేట వంటి నియోజకవర్గంలో వైసీపీని బలోపేతం చేసిన మర్రి రాజశేఖర్ లాంటి వారికి చాలా అన్యాయం జరిగింది.

Advertisement

బీసీలకు చిలకలూరిపేట టిక్కెట్ ఇవ్వాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించడంతో ఆయనకు అప్పట్లో ఎమ్మెల్యే సీటు దక్కలేదు.దీంతో రాజ్యసభ సీటు అయినా దక్కుతుందని మర్రి రాజశేఖర్ భావించారు.

కానీ మూడేళ్లు అయినా మంత్రి పదవి రాలేదు.పోనీ రాజ్యసభ సీటు ఇస్తారంటే ఇప్పుడు అదీ దక్కలేదు.

ఇలాంటి నేతలు వైసీపీలో చాలామందే ఉన్నారు.

మరోవైపు వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలోని బీసీలకు రాజ్యసభ సీటు ఇస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.అటు ఓసీలకు సంబంధించి ఒకే సామాజికవర్గానికి రెండు సీట్లను కేటాయించడం కూడా సరికాదనే విమర్శలు వస్తున్నాయి.ఇటీవల కేబినెట్ విస్తరణలో కమ్మ, వైశ్య, బ్రాహ్మణ కులాలకు సరైన చోటు దక్కలేదు.

వైరల్ : కొడుకు కోసం ఆ తండ్రి బిర్యానీతో పడిన కష్టం.. ఎమోషనల్ స్టోరీ..
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 

వీరిలో ఓ వర్గానికి రాజ్యసభ సీటు కేటాయిస్తే బాగుండేదన్న సూచనలు వినిపిస్తున్నాయి.

Advertisement

కానీ ఏపీకి చెందిన నేతలు చాలా మంది ఉండగా.వారిని కాదని ఇద్దరు టీడీపీ నేతలను జగన్ పరిగణనలోకి తీసుకోవడం వైసీపీ నేతల్లో అసంతృప్తికి కారణమైంది.తెలంగాణ వ్యక్తి ఆర్.కృష్ణయ్య గతంలో టీడీపీ సీఎం అభ్యర్థిగా చలామణి అయ్యారు.అటు బీద మస్తాన్‌రావు కూడా టీడీపీకి కీలకంగా పనిచేశారు.

వీళ్లిద్దరూ టీడీపీ మాజీ ఎమ్మెల్యేలుగా పదవులు అనుభవించిన వారే.నాలుగు సీట్లలో రెండు సీట్లు అంటే 50 శాతం సీట్లను టీడీపీ మాజీలకే కేటాయించారన్న విమర్శలు కూడా వస్తుండటం గమనార్హం.

తాజా వార్తలు