కేసీఆర్ మౌనం.. ఎందుకో మరి !

కే‌సి‌ఆర్( Cm KCR ) జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తరువాత యమ దూకుడు కనబరుస్తూ వచ్చారు.

దేశ వ్యాప్తంగా పర్యటనలు, ఆయా రాష్ట్రాలలో బహిరంగ సభలు, ముఖ్య నేతలతో భేటీలు ఇలా కే‌సి‌ఆర్ చేసిన హడావిడి మామూలుగా లేదు.

అయితే కే‌సి‌ఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన మొదటి నుంచి ఆయనకు కర్నాటక మాజీ సి‌ఎం కుమారస్వామి గట్టిగా మద్దతు పలుకుతూ వచ్చారు.వీరిద్దరు కలిసి బహిరంగ సభలకు హాజరవుతూ అందరి దృష్టిని ఆకర్షించే వారు.

దీంతో కర్నాటకలోని జేడీఎస్, బి‌ఆర్‌ఎస్( BRS party ) మద్య పొత్తు దాదాపు ఖాయమే అనుకున్నారంతా.ఇరు పార్టీలు కలిసి కర్నాటక ఎలక్షన్స్ లో పోటీ చేసే అవకాశం ఉందనే వార్తలు కూడా గట్టిగా వినిపించాయి.

కట్ చేస్తే కర్నాటక ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి.

Advertisement

ఇప్పటికే ప్రధాన పార్టీలు అన్నీ కూడా తమ తమ అభ్యర్థులను కూడా ప్రకటించాయి.కానీ అన్నీ రాష్ట్రల ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ పోటీ చేస్తుందని చెప్పుకొచ్చిన కే‌సి‌ఆర్ కర్నాటక ఎలక్షన్స్ విషయంలో కాస్త మౌనం పాటిస్తున్నారు.దీంతో కే‌సి‌ఆర్ ఏం ఆలోచిస్తున్నారు ? కర్నాటక ఎన్నికల విషయంలో ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు ? అనేది హాట్ హాట్ చర్చలకు కారణం అవుతోంది.నిన్న మొన్నటి వరకు జేడీఎస్ తో కలిసి వెళ్లాలని భావించిన కే‌సి‌ఆర్.

ఇప్పుడు కలిసి నడిచేందుకు జేడీఎస్ సుముఖత చూపకపోవడంతో కే‌సి‌ఆర్ మౌనం వహిస్తున్నారనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట.

అయితే సింగిల్ గానైనా బరిలోకి దిగే సత్తా తమకుందని చెప్పే కే‌సి‌ఆర్.ఆ దిశగా కూడా అడుగులు వేయడం లేదు.దీంతో కర్నాటక ఎన్నికలను కే‌సి‌ఆర్ లైట్ తీసుకున్నారా అనే సందేహాలు వస్తున్నాయి.

ప్రస్తుతం మహారాష్ట్రలో వరుస సభలు నిర్వహిస్తున్న కే‌సి‌ఆర్ కర్నాటకపై( Karnataka ) మాత్రం దృష్టి సారించడం లేదు.అయితే కే‌సి‌ఆర్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అంచనా వేయడం కష్టం.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అప్పటికప్పుడు వ్యూహాలు మార్చడం, హటాత్తుగా నిర్ణయాలు తీసుకోవడం కే‌సి‌ఆర్ కు కొత్తేమీ కాదు.కాబట్టి కర్నాటక ఎన్నికల విషయంలో కే‌సి‌ఆర్ వ్యూహాన్ని అంచనా వేయడం కష్టమే అంటున్నారు విశ్లేషకులు.మొత్తానికి జాతీయ రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేసిన తరువాత నానా హడావిడి చేసిన కే‌సి‌ఆర్ కర్నాటక ఎన్నికల విషయంలో సైలెంట్ గా ఉండడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

Advertisement

తాజా వార్తలు