రెండేళ్ల పాటు కొడుకు హరికృష్ణ తో ఎన్టీఆర్ ఎందుకు మాట్లాడలేదు ?

మనకు రాముడు అయినా, కృష్ణుడు అయినా ఎలాంటి పాత్ర అయినా తొలుత గుర్తచ్చేది నందమూరి తారక రామారావు గారు మాత్రమే.

అన్ని రకాల పాత్రలకు న్యాయం చేయగల ఏకైక నటుడు మన అన్నగారు.

అల్ రౌండర్ గా ఆ నాటి కాలంలో ఎవరికి సాధ్యం కానీ పాత్రలను చేసి దేశ వ్యాప్తంగా తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు.సినిమాల్లో ఎంతటి కీర్తి సంపాదించుకున్నారో, రాజకీయాలను సైతం ఒంటి చేత్తో నడిపించి అంతకన్నా మంచి పేరు గడించారు.

ఎంతో ఎత్తుకు ఎదిగిన కూడా అయన ఎప్పుడు అణిగి మణిగి ఉండేవారు.ఆ ఒక్క అలవాటే ఆయనను అంత గొప్పవాడిని చేసింది.

రాజకీయాల్లో ఎంత బిజీ గా ఉన్న కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిన ఆచి తూచి, అందరితో చర్చించి అలాగే అందరిని ఒప్పించి మరి ఆ నిర్ణయం తీసుకునేవారట.అయన ఒకసారి నో చెప్తే మాత్రం ఇక ఆ విషయం గురించి అందరు మర్చిపోవాల్సిందే.

Advertisement

అందుకే అయన పేదల పాలిట దేవుడిగా మారాడు.ఇక తన నట వారసత్వ విషయానికి వస్తే హరికృష్ణ మరియు బాల కృష్ణ లు సినిమా ఇండస్ట్రీ లో తెరగేంట్రం చేసారు.

ఎవరి పరిధిలో వారి సినిమాలు చేసిన బాలకృష్ణ సినిమల్లో మరియు రాజకీయాల్లో చక్కగా రాణిస్తున్నారు.అలాగే హరికృష్ణ సైతం కాస్త వయసు ముదిరాక సినిమా ఇండస్ట్రీ కి హీరో గా ఎంట్రీ ఇచ్చిన నటించిన తక్కువ సినిమాలతోనే ఎంతో మంచి గుర్తింపును సంపాదించారు.

ఇప్పటికి సీతయ్య సినిమా ఎన్నిసార్లు టీవిలో వచ్చిన చూస్తూనే ఉంటాం.ఇక ఎన్టీఆర్ కి సైతం హరి కృష్ణ అంటేనే ఎక్కువ మక్కువట.

నిత్యం తన తండ్రి ఎన్టీఆర్ వెనకాలే ఉంటూ, అయన చెప్పింది చేస్తూ చేదోడు వాదోడుగా నడుచుకునేవారట.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

అంతే కాదు హరికృష్ణ నోరు తెరిచి ఏది అడిగిన తండ్రి ఎన్టీఆర్ కూడా కాదనేవాడు కాదట.అలంటి ప్రేమాభిమానాలు కలిగి ఉన్న ఎన్టీఆర్ మరియు హరికృష్ణలు రెండు ఏళ్ళ పాటు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదట.అందుకు గల కారణం ఒక సినిమా హల్ అని అంత అంటూ ఉంటారు.

Advertisement

తన పేరు పైన ఒక సినిమా థియేటర్ కట్టాలని హరికృష్ణ తన తండ్రిని అడగగా, అందుకు అయన అక్కినేని వారి సలహా కోసం సంప్రదించారట.అయితే థియేటర్ కడితే పెద్దగా లాభాలు రావని, దాని స్థానంలో ఒక స్టూడియో కడితే మంచి లాభాలు వస్తాయని అక్కినేని సూచించడంతో హల్ కట్టాలనే ఆలోచన విరమించుకున్నారట ఎన్టీఆర్.

దాంతో హరికృష్ణ రెండేళ్ల పాటు తండ్రితో మాట్లాడకుండా ఉన్నారట.అయితే ఆ తర్వాత తండ్రి చెప్పింది నిజమని హరికృష్ణ అర్ధం చేసుకొని మరల మాట్లాడారట.

తాజా వార్తలు