మన నటులు కొత్త క్యారెక్టర్లు ఎందుకు చేయట్లేదంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ( Tollywood ) లో ఉన్న ఒకే ఒక చెండలమైన విషయం ఏంటంటే ఒక క్యారెక్టర్ లో చేసిన వ్యక్తి కి ప్రతి సినిమాలో అదే క్యారెక్టర్ ఇస్తు ఆయన్ని అందులోనే నటించేలా చేస్తారు.

అందుకే మన ఇండస్ట్రీ లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేయడానికి చాలా మంది నటులు భయపడుతూ ఉంటారు ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి నటుడు కూడా చాలా క్లియర్ గా హిరో అయితే హీరో గానే చేస్తాను అంటారు.ఎందుకంటే ఒకసారి ఆయన ఒక సినిమాలో గెస్ట్ గా కనిపిస్తే చాలు ఆయన ని ప్రతి సినిమాలో గెస్ట్ రోల్ కి పరిమితం చేస్తారు.అలాగే ఒక హీరో విలన్ గా చేసిన కూడా ఆ హీరో ను విలన్ రోల్ కోసమే సంప్రదిస్తారు అందుకే ఇక్కడ ఏ క్యారెక్టర్ చేయాలన్న హీరోలు ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు.

ఇక ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న అందరూ కూడా ఈ పద్దతులను పాటిస్తూ ముందుకు వెళ్తుంటారు దీనికి ఉదాహరణ గా మనం వెంకటేష్( Venkatesh ) ని తీసుకోవచ్చు ఆయన ఒకసారి మహేష్ తో సీతమ్మ వాకిట్లో సినిమా తీసాడో లేదో అటు రామ్ తో మసాలా సినిమాలో గానీ,ఇటు పవన్ కళ్యాణ్ గోపాల గోపాల సినిమా( Gopala Gopala ) లో గానీ నటింపజేసారు.అంత పెద్ద హీరో కే తప్పనప్పుడు మనమెంత అని చిన్న నటులు కొత్త క్యారెక్టర్స్ వచ్చిన కూడా చేయడం లేదు.

నిజానికి ఇండస్ట్రీ ఇలా ఉండకూడదు ఇలా ఉంటే ఏ ఆర్టిస్ట్ కూడా మంచి యాక్టింగ్ స్కిల్స్ ని చూపించలేడు అలా అందరూ నటులు అన్ని క్యారెక్టర్స్ చేస్తేనే నటులకు కూడా వేరియేషన్స్ వస్తాయి.కాబట్టి ప్రతి నటుడు కూడా అన్ని రకాల పాత్రలు చేయాలి విలన్ గా చేయాలి హీరో గా చేయాలి కామెడీ పాత్రలు చేయాలి ఇలా చేసుకుంటూ వెళ్తేనే నటుడు అనే దానికి ఒక అర్థం ఉంటుంది లేకపోతే ఎప్పుడు హీరో హీరోయిజం చూపిస్తూనే ఉంటాడు.అందుకే ప్రతి నటుడు అన్ని పాత్రలు చేయాలి ప్రేక్షకులు కూడా వాటిని అంగీకరించాలి.

ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?

తాజా వార్తలు