ప్రజలను కలవని లీడర్ మనకెందుకు..?: ఖర్గే

జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ లో కాంగ్రెస్ ప్రజాగర్జన సభ జరిగింది.

ఈ సభకు హాజరైన ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అభ్యర్థులకు మద్ధతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

బీఆర్ఎస్ పదేళ్ల పాలన కాలంలో తెలంగాణలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని మల్లికార్జున ఖర్గే అన్నారు.కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు.

ప్రజలను కలవని లీడర్ మనకెందుకన్న ఖర్గే ఫాంహౌస్ లో కూర్చుని కేసీఆర్ పాలన చేస్తున్నారని మండిపడ్డారు.ఇప్పుడు తెలంగాణలో జరిగే ఎన్నికలు అవినీతిపై పోరాటమని పేర్కొన్నారు.

కాంగ్రెస్ గెలవకుండా మోదీ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.కేసీఆర్, మోదీ ఇద్దరూ ఒక్కటేనన్న ఖర్గే తెలంగాణలో వచ్చే ఫలితం దేశం మొత్తాన్ని ప్రభావితం చేస్తుందని తెలిపారు.

Advertisement
ఈ ముందు జాగ్ర‌త్త‌లో తెల్ల జుట్టుకు దూరంగా ఉండొచ్చు.. తెలుసా?

తాజా వార్తలు