కొత్త బట్టలకు పసుపు ఎందుకు రాస్తారో తెలుసా ?

పెళ్లి రోజు,పుట్టిన రోజు,పర్వ దినాలు,పండుగల సమయంలో కొత్త బట్టలను వేసుకోవటం అనేది చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరిని ఆనందపరుస్తుంది.

పిల్లలు అయితే కొత్త బట్టలు ఎప్పుడు వేసుకుంటామో అని చాల ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.

కొత్త బట్టలను చూడగానే పిల్లలు వేసుకోవాలని ఉబలాట పడితే పెద్దవారు వారిని వారించి కొత్త బట్టలకు పసుపు రాస్తారు.కొత్త బట్టలకు పసుపు రాయటం అనేది పూర్వ కాలం నుండి ఒక ఆచారంగా వస్తుంది.

Why Do We Apply Turmeric Powder To New Clothes-Why Do We Apply Turmeric Powder T

పవిత్రమైన పుణ్య కార్యాలలో పసుపును ప్రధానంగా వాడటం మనం చూస్తూనే ఉంటాం.అంతేకాక పసుపును మంగళప్రదంగా కూడా భావిస్తాం.

వివిధ దశలలో ఎన్నో రూపాంతరాలు చెందిన తరువాత గాని వస్త్రం బయటకు రాదు.పట్టు .నూలు .ఉన్ని వస్త్రాల తయారీ సమయాల్లో కొన్ని రకాల సూక్ష్మ క్రిములు వస్త్రంలో కలిసి పోతుంటాయి.ఫలితంగా అవి ధరించిన వారు అనారోగ్యానికి గురవుతూ వుంటారు.

Advertisement

అంతేకాక వస్త్రాలు చేతులు మారటం వలన కూడా సూక్మక్రిములు చేరతాయి.అలాంటి సూక్ష్మ క్రిముల బారిన పడకుండా ఉండటానికి కొత్త బట్టలకు పసుపు రాస్తారు.

పసుపు లక్ష్మీదేవి నివాస స్థానంగా చెప్పటం వలన శుభకార్యాల్లో వాడుతూ వస్తున్నారు.అయితే అశుభకార్యాల్లో పెట్టే వస్త్రాలకు మాత్రం పసుపును రాయరు.

Advertisement

తాజా వార్తలు