తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మలమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో చిత్రాలలో నటించిన ఈమె చివరిరోజుల్లో సినిమాలకు దూరం అయింది.
అలా సినిమాలలో ఎందుకు నటించలేదు అనే విషయం గురించి ఒకానొక సందర్భంలో ఈమె మాట్లాడి అసలు విషయాలను బయటపెట్టారు.ఈ సందర్భంగా నిర్మలమ్మ మాట్లాడుతూ … నేను ఎప్పుడు పోతానో నాకే తెలియదు నా శరీరం నుంచి ఆత్మ ఎప్పుడు అనంత లోకాల్లో కలుస్తుందో నాకే తెలియదు.
ఈ వయసులో సినిమాల్లో నటిస్తూ అనుకోకుండా మధ్యలో చనిపోతే నిర్మాతకి ఎంత నష్టం.దర్శకుడిగా కూడా చాలా ఇబ్బంది మిగతా ఆర్టిస్టులు కి కూడా ఇబ్బందే కదా ఈ ముసల్ది చచ్చి మాకు తిప్పలు తెచ్చింది అని తిట్టుకోకూడదు.
నేను అసలే మాట పడే రకం కాదు.నేను చనిపోయినా కూడా ఎవరూ నన్ను తిట్టుకోకూడదు.
అదే నా ఆశ అందుకే సినిమాల్లో నటించడం కూడా ఆపేశాను… అంటూ దివంగత సీనియర్ నటి ఎంతో మంది హీరోలకు అమ్మగా బామ్మగా నటించిన నిర్మలమ్మ గారు చెప్పిన మాటలు ఎంత బాగున్నాయో కదా.ఈ తరంలో ఇలా ఆలోచించడం పక్క వాళ్ళ గురించి ఇంతగా ఆలోచించడం చాలా అరుదు.
ఒకప్పటి హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు కాంతారావు కాకుండా చిరంజీవి, బాలయ్యలాంటి అగ్ర హీరోలకు సైతం అమ్మగా బామ్మగా నటించినా ఈమెకు అంతటి స్థాయిలో పేరు రాలేదనే చెప్పాలి.ఇకపోతే చిన్నప్పటి నుంచి జానపదాల మీద ఆసక్తివున్న నిర్మలమ్మ 19 ఏళ్ళు వచ్చేసరికి తన తల్లి పెళ్లి చేసుకోమని అడిగితే తనని కళాకారునిగా ఎవరైతే రాణిస్తారో వారిని పెళ్లి చేసుకుంటానని చెప్పిందట.

ఆ తర్వాత కళల పట్ల ఆసక్తి ఉన్న జి.వి.కృష్ణారావుతో ఆమె వివాహం జరిగింది.ఆ తర్వాత వారిద్దరిదీ ఒకే మాట ఒక అడుగు లాగా సాగేది ఆంధ్ర కళా పరిషత్ లో మూడు అవార్డులు కూడా గెలుచుకున్నారు ఆమె ఎక్కడికెళ్లినా అవార్డు దక్కడం మాత్రం ఖాయంగా జరిగేది ఒకసారి ఆమె నాటకం వేసినప్పుడు ఆ నాటకానికి ఓ ప్రముఖ హిందీ నటుడు హాజరు అయ్యాడట ఆ నాటకంలో దాదాపు పావుగంట సేపు నటించాలి నాటకం జరిగిన తర్వాత నటుడు వచ్చి శివం బాగా నటించింది అని చమత్కరిస్తారు నిర్మలమ్మ గారిని పొగిడారట.

వీటితోపాటు నిర్మలమ్మ గారికి రేడియో నాటకాలన్నా కూడా చాలా మక్కువట.ఆ తర్వాత పుల్లయ్యగారు ఉండవల్లి, బియన్ రెడ్డి గారు పరిచయం అవడంతో నిర్మలమ్మగారికి సినిమాల్లో అవకాశం వచ్చింది.ఎత్తుకు పై ఎత్తు, మనుషులు మారాలి మొదలుకొని ఆమె చనిపోయే వరకు తొమ్మిది వందల వరకూ సినిమాల్లో నటించారు.ఒకే సంవత్సరంలో 19 సినిమాలు నటించిన చరిత్ర కూడా నిర్మలమ్మ గారికి ఉంది.

ఇంతటి చరిత్ర ఉన్న ఈమె వయసు మీద పడే కొద్దీ ఆఫర్లు వస్తున్నా కూడా నటించడానికి మాత్రం ఫుల్ స్టాప్ పెట్టేశారు.దర్శక నిర్మాతలు తనను నటించమని అడిగితే తాను ఎప్పుడూ పోతానో తనకే తెలియదని సున్నితంగా తిరస్కరించేదట.ఆమె ఆఖరి సారిగా తెలుగు సినీ వజ్రోత్సవ వేడుకల్లో కనిపించారు.2009 వ సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీన 89 ఏళ్ళ వయసులో హైదరాబాదులో అనారోగ్య కారణాల వల్ల నిర్మలమ్మ గారు మరణించారు.