బ్రూస్లీ టైటిల్ మార్చొద్దు అన్నది ఎవరు ?

సినిమా అనేది క్రియేటివ్ ఫీల్డ్ .ఒకరికి నచ్చింది , ఇంకొకరికి నచ్చదు .

ఒకరికి ఒప్పు అయినది .ఇంకొకరికి తప్పు కావచ్చు.బ్రూస్లి టైటిల్ విషయంలో కుడా ఇదే జరిగిందట .ఇంతకీ ఎవరు వద్దాన్నారు.ఎవరు కావాలని పట్టు పట్టారో తెలుసుకోవాలని ఉందా ! సినిమా టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు .కాని టైటిల్ ఏం పెట్టాలో అర్థం కాలేదు యూనిట్ సభ్యులకి .ఒకరు మై నేమ్ ఇజ్ రాజు అంటే .ఇంకొకరు ఇంకేదో అన్నారు .బ్రూస్లీ అని వార్తలు బయటకి వచ్చినా ఎవరు దాన్ని అటు ఖండించలేదు, ఇటు ఒప్పుకోను లేదు.మొత్తానికి టైటిల్ లేకుండానే టీజర్ విడుదల చేసారు.

రామ్ చరణ్, శ్రీను వైట్ల బ్రూస్లీ మీద అంతగా ఆసక్తి చుపించలేదట .అసలు వద్దు అనుకున్నారట .కాని మెగాస్టార్ చిరంజీవి పట్టు పట్టి మరీ చరణ్ , వైట్ల ను ఒప్పించారట .కథ పరంగా, హీరో క్యారెక్టర్ పరంగా చూసుకుంటే "బ్రూస్లీ" సరైన టైటిల్ అని మెగాస్టార్ చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.టైటిల్ ఇలాంటి పరిస్థితుల్లో ఓకే చేసారు కాబట్టే హంగు ఆర్భాటాలు లేకుండా .సడెన్ గా బ్రూస్లీ టైటిల్ ని తన ఫేస్ బుక్ లో అనౌన్స్ చేసాడు రామ్ చరణ్.

మరో బాహుబలి వస్తుందని ప్రకటన చేసిన రాజమౌళి.. ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్ అంటూ? 
Advertisement

తాజా వార్తలు