షర్మిల ఎంట్రీతో ఎవరికి ముప్పు...ప్రజల మనసు దోచేనా

తెలంగాణ రాజకీయాల్లో ఏ చడీచప్పుడు లేకుండా వై.ఎస్.

షర్మిల ఎంట్రీ ఇచ్చింది.

అసలు ఎవరు ఊహించకుండా ఓ పత్రిక రాసిన కథనం ద్వారా షర్మిల ఎంట్రీ వెలుగులోకి వచ్చింది.

అయితే ఇది బయటపడ్డ కొన్ని రోజులకే షర్మిల వైఎస్సార్ అభిమానులతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించి, స్వయంగా తానే తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.ఆ తరువాత జిల్లాల వారీగా ఉన్న నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ ఏర్పాటుపై నేతల సలహాలు తీసుకున్నారు.

ఇక ఆ సమావేశాల సందర్బంగా షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో హీట్ పుట్టించాయి.అయితే ఈ ప్రక్రియల అనంతరం ఏప్రిల్ 9న పార్టీ ఏర్పాటుకు సంబంధించి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు.

Advertisement

ఇక షర్మిల పార్టీ పేరు, జెండా వై.ఎస్.విజయమ్మ చేతుల మీదుగా చేయనున్నారు.షర్మిల ఎంట్రీతో ఎవరికి నష్టం అనే ప్రశ్న ఇప్పుడు మొదలైంది.

అయితే షర్మిల పార్టీ వల్ల ప్రస్తుతానికి ఎవరికీ నష్టం జరిగే పరిస్థితి లేదని, ఇప్పుడిప్పుడే బలపడుతున్న బీజేపీకి ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.ఎందుకంటే తెలంగాణలో ఖమ్మం, మహబూబ్ నగర్ లాంటి జిల్లాలో ఎంతో కొంత బలపడాలని చూస్తున్న బీజేపీ, ఆయా జిల్లాలో షర్మిల రాక వల్ల తీవ్రమైన నష్టం అని చెప్పవచ్చు.

ఏది ఏమైనా షర్మిల సభ తరువాత వివిధ పార్టీలలో ఉన్న అసంతృప్తులందరు షర్మిల పార్టీలో చేరతారా ఏమి జరగనుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.చూద్దాం ప్రజల మనసును షర్మిల పార్టీ గెలుస్తుందా.

షర్మిల పార్టీ ఏమేరకు తెలంగాణ రాజకీయాలలో సత్తా చాటనుందనేది చూడాల్సి ఉంది.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు