Srikanth : వామ్మో అందరు చూస్తుండగానే హీరో శ్రీకాంత్ పై చేయి చేసుకున్న సీనియర్ హీరోయిన్.. ఎవరంటే?

సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు శ్రీకాంత్ ( Srikanth ) ఒకరు.

ఈయన కెరియర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలలో చేస్తూ ఆ తర్వాత విలన్ గా అవకాశాలు అందుకున్నారు.

ఇలా విలన్ పాత్రలలో నటించినటువంటి శ్రీకాంత్ అనంతరం హీరోగా అవకాశాలను అందుకున్నారు.అయితే ఈయన కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగే సినిమాలలో నటిస్తూ ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ను సంపాదించుకున్నారు.

ఇలా ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటిస్తూ విపరీతమైనటువంటి శ్రీకాంత్ ఇప్పటికి వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇక ఈయన ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ విలన్ పాత్రలలో( Srikanth Villain Roles ) నటించడమే కాకుండా యంగ్ హీరోలకు అన్నయ్యగాను బాబాయ్ పాత్రలలోనూ నటిస్తూ సినిమాల పరంగా ఎంతో బిజీ అయ్యారు.నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా కొనసాగుతున్నటువంటి శ్రీకాంత్ గతంలో నటి రాశి( Raasi ) తో కలిసి ఎన్నో సినిమాలలో నటించారు.వీరిద్దరి కాంబినేషన్లో దాదాపు పది సినిమాల వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

Advertisement

ఇక వీరిద్దరి నటన ఎంతో చూడముచ్చటగా ఉండేది.

ఇలా శ్రీకాంత్ రాశి పలు సినిమాలలో నటిస్తూ తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవటం వల్ల చాలామంది వీరిద్దరూ నిజమైన భార్య భర్తలు లాగే ఉన్నారని భావించేవారు దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఎఫైర్ ఉంది అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వీరీ గురించి వార్తలు వచ్చాయి.ఇలా ఒక హీరో హీరోయిన్ కలిసినటిస్తే వారి గురించి ఇలాంటి వార్తలు రావడం సర్వసాధారణం శ్రీకాంత్ రాశి ఇద్దరు కూడా ఈ వార్తలను పెద్దగా పట్టించుకోలేదు.

ఇక రాశి కూడా ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే.బుల్లితెరపై ప్రసారం అవుతున్నటువంటి జానకి కలగనలేదు సీరియల్( Janakai Kalaganaledu ) లో నటించారు.అలాగే పలు సినిమాలలో కూడా బిజీ అవుతున్నారు.

తాజాగా రుద్రంకోట సినిమా( Rudramkota Movie ) ద్వారా వీరు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్వహించినటువంటి సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు.అయితే ఈ వేదికపై శ్రీకాంత్ రాశి మధ్య ఒక ఆసక్తికరమైనటువంటి సన్నివేశం చోటుచేసుకుంది.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

వేదికపై శ్రీకాంత్ రాసి ఇద్దరు కూడా ఎంతో సరదాగా మాట్లాడుకున్నారు అయితే శ్రీకాంత్ రాశిని చూస్తూ నవ్వుతూ మాట్లాడటంతో ఆమె వెనుక వీపుపై అందరూ చూస్తుండగానే శ్రీకాంత్ ను కొట్టింది అయితే సీరియస్ గా మాత్రం కాదని వీరిద్దరూ సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుతూనే శ్రీకాంత్ కొట్టడంతో అక్కడున్నటువంటి వారందరూ ఆశ్చర్యపోయారు.అయితే వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉండడం చేతనే రాశి తనని అలా కొట్టారు కానీ మరే ఉద్దేశంతోనే కొట్టలేదని చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు