టాలీవుడ్ లో ప్రతి ఏటా చాలా మంది హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తూనే ఉంటారు.
వారిలో కొంత మంది ది మాత్రమే పైచేయి అయితే మరి కొంత మంది మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోతారు.
మరి 2022వ సంవత్సరం లో చాలా సినిమాలు వచ్చాయి దాంట్లో పై చేయి సాధించిన ఆ హీరోయిన్స్ ఎవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.ముఖ్యంగా గత ఏడాది అంటే 2022 లో పూజా హెగ్డే, అనుపమ పరమేశ్వరన్, మృనాల్ ఠాకూర్, శ్రీ లీల, రష్మిక, సాయి పల్లవి, కృతి శెట్టి వంటి హీరోయిన్స్ చాలా బిజీ గా ఉన్నారు.
దుల్కర్ సల్మాన్ సరసన హీరోయిన్ గా నటించింది మృనాల్ ఠాకూర్.సీతారామంలో వీరిద్దరి నటనకు విమర్శకుల నుంచి అనేక ప్రశంసలు లభించాయి.
ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే.ఈ చిత్రం ద్వారా అమే చాలా క్రేజ్ వున్న హీరోయిన్ గా మారింది.
అయితే ఆమె తొందరపడి ఎలాంటి సినిమాకి కమిట్ అవ్వడం లేదు.తన పాత్రకి ఎంత ప్రాధాన్యత ఉందో మాత్రమే చూసుకుంటుంది.
సినిమా కథను అలాగే కంటెంట్, బ్యానర్ ఏంటి, హీరో ఎవరు అనే విషయాలను ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తుంది.అతి త్వరలో నానితో హీరోయిన్ గా నటించబోతోంది.ఇక విరాటపర్వం, గార్గి వంటి సినిమాలతో సాయి పల్లవి బిజీగా కనిపించినప్పటికీ ఈ రెండు చిత్రాలు ఫ్లాప్ అవడంతో సాయి పల్లవి మరొక ప్రాజెక్ట్ ఒప్పుకోవడం లేదు.2022వ సంవత్సరంలో ఎవరు ఊహించని విధంగా పాన్ ఇండియా చిత్రంగా ఎదిగిన కార్తికేయ 2 లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.ఆ తర్వాత ఆమె నటించిన 18 పేజెస్ కూడా బాగానే వసూలు సాధించింది.
వరస హిట్స్ లో నటించి అనుపమ ప్రస్తుతం కెరియర్ లోనే పిక్ టైంలో ఉంది.ఇక 2020 సంవత్సరంలో సంక్రాంతికి విడుదలైన బంగార్రాజు సినిమాలు మినహా కృతి శెట్టి కి మరొక విజయం దక్కలేదు.
అయినా కూడా ఆమెకు ఉన్న క్రేజ్ లో ఏమాత్రం తేడా లేదు.వచ్చే సంవత్సరం కూడా ఆమె అనేక సినిమాల్లో నటించనుంది.
పెళ్లి సందడి, ధమాకా వంటి సినిమాలలో నటించి ప్రస్తుతం టాలీవుడ్ లో పర్ఫెక్ట్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది శ్రీ లీల.ఇక ధమాకా సినిమా తర్వాత అమే క్రేజ్ ఆకాశాన్ని అంటుంది.ఇక పుష్ప సినిమా పాన్ ఇండియా ప్రాజెక్టుగా అవతరించిన సంగతి మనకు తెలిసింది ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.
రష్మిక ఈ చిత్రం తర్వాత ఆమె బాలీవుడ్ లో యమ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.కానీ తెలుగులో మరో ప్రాజెక్ట్ చేయడానికి మాత్రం ఆమె అంగీకరించడం లేదు.
రాధే శ్యాం, ఆచార్య లాంటి సినిమాలతో పూజ హెగ్డే వరస ఫ్లాపులు మూట కట్టుకుంది అయినా కూడా ఆమెకు వలస పెట్టి అవకాశాలు వస్తూనే ఉన్నాయి.ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఈ హీరోయిన్స్ అందరిలో కెల్లా 2022 ఇయర్ కి క్రేజీ హీరోయిన్గా చెప్పుకోవాల్సి వస్తే ఖచ్చితంగా మృణాల్ పేరు చెప్పుకోవచ్చు.
చేసిన ఒకే ఒక సినిమాతో అద్భుతమైన గుర్తింపు దక్కించుకుంది.అందుకే హీరోయిన్ ఆఫ్ ది ఇయర్ గా మృణల్ ఠాకూర్ నీ కన్ఫర్మ్ చేయచ్చు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy