చాలామందిని స్టార్లు గా చేసిన డైరెక్టర్స్ వాళ్ల కొడుకులకే హిట్టు ఇవ్వలేకపోయారు వాళ్లేవరంటే..?

ఇండస్ట్రీ లో చాలామంది డైరెక్టర్స్ నార్మల్ హీరోలు గా ఉన్న చాలా మంది హీరోలకి హిట్స్ ఇచ్చి వాళ్ళని స్టార్లు గా చేసారు.

వాళ్ళు కూడా ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్స్ గా పేరు కూడా సంపాదించుకున్నారు.

కానీ ఏం లాభం వాళ్ళ కొడుకులు హీరోలుగా మారి సినిమాలు చేస్తున్నప్పుడు మాత్రం వీళ్లు కనీసం ఒక్క హిట్ కూడా ఇవ్వలేకపోయారు ఆ డైరెక్టర్స్ ఎవరో ఒకసారి చూద్దాం.ఈ లిస్ట్ లో మొదట మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తి దాసరి నారాయణ రావు గారు.

ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీ లో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి.అప్పట్లో ఈయనతో ఒక్క సినిమా చేస్తే చాలు అని చాలా మంది స్టార్ హీరోలు అనుకునేవారు 150 సినిమాలకి డైరెక్షన్ వహించిన ఒకే ఒక వ్యక్తి గా గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో కూడా తన పేరు నమోదు చెసుకున్నారు.

కానీ ఆయన కొడుకు అరుణ్ కుమార్ హీరోగా చిన్నాఅనే సినిమా చేసినప్పటికీ అది సక్సెస్ కాలేదు.ఆ తర్వాత వేరే వాళ్ళ డైరెక్షన్ లో అరుణ్ సినిమాలు చేసినప్పటికీ అవి కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.

Advertisement

ఇక ఈ లిస్ట్ లో రెండో డైరెక్టర్ గా కోదండ రామిరెడ్డి గారి పేరు చెప్పుకోవచ్చు.ఒకప్పుడు చిరంజీవి తో చాలా సినిమాలు తీసి ఆయన్ని మెగాస్టార్ ని చేయడం లో డైరెక్టర్ గా కోదండ రామిరెడ్డి చాలా ముఖ్య పాత్ర పోషించాడనే చెప్పాలి.కానీ ఆయన కొడుకు వైభవ్ ను పెట్టి గొడవ అనే సినిమా చేసాడు ఈ సినిమా బాక్సఫీస్ వద్ద ప్లాప్ అయింది.

ఇక ఆ తర్వాత చెప్పుకోవాల్సిన పేరు పూరి జగన్నాథ్ ఈయన మహేష్ బాబు లాంటి హీరోకి పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చి ఆయన్ని సూపర్ స్టార్ చేసిన పూరి, ఆయన కొడుకు అయిన ఆకాష్ పూరి ని హీరోగా పెట్టి తీసిన మెహబూబా సినిమా బాక్సఫీస్ వద్ద ప్లాప్ అయింది.

Advertisement

తాజా వార్తలు