వరాహ జయంతి ఎప్పుడు, ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

హిందూ సంప్రదాయాల ప్రకారం మనం వరాహ జయంతిని జరుపుకుంటాం.అయితే వరాహ జయంతి ఎప్పుడు, ఎందుకు జరుపుకుంటారో మాత్రం చాలా మందికి తెలియదు.

తెలుగు క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో మొదటి నెల అయిన చైత్రంలో నెలలో రెండవదైన బహుళ పక్షంలో, పక్షంలో 12వది అయిన ద్వాదశి తిథినాడు అంటే అమావాస్య మరో మూడు రోజుల్లో రాబోతుందనగా చైత్ర బహుళ ద్వాదశి నాడు శ్రీహరి. వరాహ రూపాన్ని ధరించి సముద్రంలో దాగిన భూమిని ఉద్ధరించాడు.

భూమండలాన్ని పైకి తీసుకొచ్చాడు.ఇలా వరాహ రూపాన్ని ఎత్తిన శ్రీ మహా విష్ణువు పేరిట ఉన్న పండుగే వరాహ జయంతి.

నిజానికి హిరణ్యాక్షుడనే పేరు గల రాక్షసుడు భూమినంతా ఓ చుట్టగా చుట్టి సముద్రంలోకి నెట్టి పడేసాడాని.అలా సంద్రంలో పడి ఉన్న భూమినే శ్రీహరి వరాహ రూపం ఎత్తి తన కోరల ద్వారా సముద్రం నుండి ఇవతలికి తీసుకొచ్చాడని చెప్పే కథ అంత సరికాదు.

Advertisement

భూమి అనేది చతుసముద్రమువేలా వలయితం.అంటే తన చుట్టూ నాలుగు సముద్రాలు ఉండగా ఆ మధ్యలో ఉండేది అని అర్థం.

నీళ్లు రెండు వైపులుగా ప్రవహిస్తే.ఆ రెంటికీ మధ్యగా ఉన్న భూప్రదేశాన్ని ద్వీపం అంటారు.

అలాగే మూడు వైపులా ప్రవహిస్తే.త్రీపం అంటారు.

నాలుగు వైపులా నీరున్న కారణంగా భూమి చతుద్వీపం అవుతుంది.ఇలా సముద్రాలు నాలుగు తన చుట్టూ కల్గి ఉన్న భూమి ఒక్క మారు సముద్రాల ముంపుకి గురైంది.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
Mangalampalli Balamurali Krishna: మరో జన్మంటూ ఉంటె క్రికెటర్ గానే పుడతాడట....మనసులో మాట బయటపెట్టిన మహానుభావుడు.

ఆ సందర్భంలో ఈ భూమి నీటిలో మునిగిపోకుండా ఉండేందుకు ఆ శ్రీ మహా విష్ణువు వరాహ రూపాన్ని ఎత్తి ఆ కోరలతో పైకి తీసుకువచ్చాడు.ఇలా తీసుకువచ్చే సందర్భంలో భూమి నాశనాన్ని ఇష్టపడే హిరణ్యాక్షుడు శ్రీహరికి అడ్డువచ్చాడు.

Advertisement

ఏదైనా పెనుగులాట జరిగినట్లైయితే తన కోరల మీద ఉన్నభూమి తిరిగి సంద్రంలో పడిపోయే అవకాశం మెండాగ ఉందని భావించిన శ్రీహరి ఎంతో అప్పటి వరకు కరుణ చూపించిన హిరణ్యాక్షుని మీద కోపించి అతడిని చంపేశాడు.అదే వరాహ జయంతిగా ఒక రోజున హిరణ్యాక్షవధ మరొక రోజున జరగలేదు.

హిరణ్యాక్షుడి వధించడానికే పుట్టిన స్వామి ఆ హిరణ్యాక్ష వధని వరాహ జయంతి రోజునే చేశాడు.అందు కోసమే వరాహవాతారాన్ని ఎత్తాడు అని అర్థం.

తాజా వార్తలు