Shobha Shetty :శోభా శెట్టి ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశా.. పెళ్లి పై వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చిన యశ్వంత్ రెడ్డి..!!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బిగ్ బాస్ ట్రెండే నడుస్తుంది.ఇక ప్రతి బిగ్ బాస్ సీజన్లో ఎవరో ఒకరు వరస్ట్ కంటెస్టెంట్ ఉంటారు.

ఇక ఈ బిగ్ బాస్ 7 ( Biggboss 7 ) లో మాత్రం ముందు నుండి వరస్ట్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుంది శోభా శెట్టి.ఈమె కార్తీకదీపం ( Karthika deepam )సీరియల్ లో మోనిత గా ఎలా అయితే నటించిందో హౌస్ లో మోనిక కంటే డేంజర్ గా నటించి అందరి చేత ఛీ కొట్టించుకుంది.

ఇక ఈమె ఐదో వారం నుండే పంపించాలని చాలామంది నెటిజన్స్ కామెంట్లు పెడుతూ ఓట్లు తక్కువ వేస్తున్నప్పటికీ బిగ్ బాస్ మాత్రం ఆమెను దత్తత తీసుకున్నట్లే ప్రవర్తిస్తున్నారు.ఆమెను ప్రతిసారి నామినేషన్ నుండి తప్పిస్తూ సేవ్ చేస్తూ బిగ్ బాస్ ఓటింగ్ పై నమ్మకం లేకుండా చేసుకుంటున్నారు.

ఎందుకంటే చాలామంది శోభా శెట్టి ( Shobha Shetty ) బయటికి వెళ్లాలని అనుకుంటున్నారు.ఇక రీసెంట్గా స్ట్రాంగ్ కంటెంట్ అయిన గౌతమ్ కృష్ణని ఎలిమినేట్ చేశారు.ఇలా చాలాసార్లు శోభా శెట్టి సేవ్ అయింది.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లకముందే శోభా శెట్టి పెళ్లి చేసుకోబోతుందని,అలాగే కార్తీకదీపం సీరియల్ లో తనకు మరిదిగా చేసిన యశ్వంత్ రెడ్డితో చాలా రోజుల నుండి రిలేషన్ లో ఉందని వార్తలు వినిపించినప్పటికీ దానిపై క్లారిటీ ఇవ్వలేదు.ఎప్పుడైతే యశ్వంత్ రెడ్డి బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చారో ఆ సమయంలో వీరి మధ్య ఉన్న లవ్ బయటపడింది.

అయితే బిగ్ బాస్ లో శోభా శెట్టి ప్రవర్తన చూసి అందరూ ఏంటి భయ్యా నువ్వు ఈమెని ఎలా భరిస్తున్నావు? ఎలా లవ్ చేసావ్ అని కామెంట్లు పెడుతున్నారు.దానికి యశ్వంత్ రెడ్డి ( Yashwanth reddy ) క్లారిటీ ఇస్తూ.మొదటి శోభా నే నాకు ప్రపోజ్ చేసింది.

కానీ నేను నో చెప్పాను.ఆ తర్వాత ఆరు నెలల సమయం తీసుకొని ఎస్ చెప్పా ఇక శోభా శెట్టిని నేను భరించడం కాదు నన్నే శోభా శెట్టి భరిస్తుంది.

హౌస్ లో అందరి దగ్గర వారించినట్లు నా దగ్గర వారించదు.అయితే కరెక్ట్ పాయింట్ ఉంటే కచ్చితంగా ఆమె అక్కడ వారించి తీరుతుంది.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

నా దగ్గర అంతలా మాట్లాడదు.తప్పుంటే తప్పని చెబుతుంది.

Advertisement

అంతే ఇక హౌస్లో ఆమె మాట్లాడే సమయంలో మాట్లాడుతుంది కానీ నెగెటివిటీ చూపించేవారు చూపిస్తారు.అలాంటివారిని నమ్మకూడదు పాజిటివ్ గా వెళ్లాలి అంతే.

ఇక బిగ్ బాస్ నుండి వచ్చాక పెళ్లి చేసుకుంటాను అని శోభా చెప్పింది.అయితే పెళ్లి గురించి ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోలేదు.

బహుశా త్వరలోనే ఉంటుంది కావచ్చు అంటూ శోభా శెట్టి (Shobha Shetty) లవర్ యశ్వంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

తాజా వార్తలు