Bigg Boss Season 6 Model Rajasekhar : నాన్న చనిపోతే ఆఫీస్ బాయ్ గా పని చేశా.. బిగ్ బాస్ విన్నర్ తనే: రాజశేఖర్

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమం చివరి దశకు చేరుకుంది.

ఇక ఈ కార్యక్రమం చివరివారాలలోకి రావడంతో ఈ కార్యక్రమం విన్నర్ ఎవరవుతారు అనే విషయం గురించి ఆత్రుత నెలకొంది.

ఇక గతవారం ఈ హౌస్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.ఇక 12వ వారంలో భాగంగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన మోడల్ రాజశేఖర్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ బిగ్ బాస్ కార్యక్రమం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన 15 ఏళ్ల వయసులోనే తన తండ్రి చనిపోవడంతో ఇంటి బాధ్యతలను తన భుజాలపై వేసుకొని ఆఫీస్ బాయ్ గా పని చేశానని తెలిపారు.ఇలా ఆఫీస్ బాయ్ గా పనిచేస్తూనే చదువుకున్నానని, అలాగే మోడలింగ్ వైపు అడుగులు వేసి ఎన్నో కమర్షియల్ బ్రాండు యాడ్స్ లో అవకాశాలు అందుకున్నానని తెలిపారు.

ఇక చిన్నప్పుడే కుటుంబ బాధ్యతలు తీసుకోవడం వల్ల తనకు కొంత మెచ్యూరిటీ వచ్చిందని ఇక బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లిన తర్వాత మరికొన్ని అనుభవాలను తెలుసుకున్నానని తెలిపారు.

Advertisement

ముందు ముందు మనకంటూ ఓ గుర్తింపు ఉండడం కోసమే బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలని కోరుకున్నాననీ తెలిపారు.ఇక బిగ్ బాస్ హౌస్ లో పాటిస్పేట్ చేసిన ప్రతి ఒక్కరు తనకు మంచి స్నేహితులేనని ఈ సందర్భంగా రాజ్ వెల్లడించారు.ఇక ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్లలో రేవంత్ బిగ్ బాస్ విన్నర్ అవుతారని రాజశేఖర్ తెలిపారు.

రేవంత్ విన్నర్ అని చెప్పిన ఈయన రెండవ పొజిషన్లో ఎవరుంటారనే విషయాన్ని మాత్రం చెప్పలేమని ప్రతిసారి ఓటింగ్ మారుతూ ఉందని చెప్పుకొచ్చారు.ఈ క్రమంలోనే బిగ్ బాస్ విన్నర్ గురించి మోడల్ రాజశేఖర్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు