Dimple Kapadia : ఆ హీరోని పెళ్లి చేసుకున్న తర్వాత నా జీవితం ముగిసిపోయింది.. అలనాటి నటి కామెంట్స్ వైరల్?

ఒకప్పుడు భారతీయ సినిమా తొలి రోజుల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన స్టార్ హీరోలలో రాజేష్ కన్నా( Rajesh khanna ) కూడా ఒకరు.

అప్పట్లో వరుసగా 15 హిట్లు సాధించిన ఘనత ఆయన సొంతం.

ఇక ఆ సమయంలోనే 1973లో బాబి( boby ) అనే సినిమాతో వెండితెరకు హీరోయిన్గా పరిచయమైంది డింపుల్ కపాడియా( Dimple Kapadia ).ఈ సినిమా విడుదలకు ముందే అప్పట్లోనే ఆమె అందచందాల గురించి సినిమా ఇండస్ట్రీలో వార్తలు జోరుగా వినిపించాయి.ఆ వార్తలు కాస్త రాజేష్ ఖన్నా చెవిన పడ్డాయి.

ఇక ఆమెను చూసిన రాజేష్ కన్నా తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడ్డం మాత్రమే కాకుండా తన చేయి పట్టుకుని నడిచాడు.1973లోనే తనకంటే రెట్టింపు వయసు ఉన్న రాజేష్ ను పెళ్లాడింది డింపుల్ కపాడియా.పెళ్లి తర్వాత ఆమె మళ్ళీ ఏ సినిమాలో నటించలేదు.

ఎంతో అన్యోన్యంగా ఉన్నారు అనుకుంటున్న ఈ జంట ఊహించని విధంగా 1984లో విడిపోయారు.విడిపోయినప్పటికీ విడాకులు మాత్రం తీసుకోలేదు.

Advertisement

వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.భర్త నుంచి విడిపోయిన తర్వాత 1985లో సాగర్( Sagar ) సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది డింపుల్ కపాడియా.

ఇది ఇలా ఉంటే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డింపుల్ కపాడియా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ.ఒకసారి నేను రాజేష్ కన్నా చార్టెడ్ ఫ్లైట్ లో అహ్మదాబాద్ కి వెళుతున్నాము.అప్పుడు అతను ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు.

విమానం దిగడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో నా కళ్ళలోకి సూటుగా చూసి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు.అప్పటికి నా వయసు 16 సంవత్సరాలు మాత్రమే.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?

పెళ్లికి సరిగ్గా ఏడు రోజుల ముందు అతడి గురించి పూర్తిగా తెలుసుకున్నాను.తొందర తొందరగా మా పెళ్లి జరిగిపోయింది.

Advertisement

ఏ రోజు అయితే అతన్ని పెళ్లి చేసుకున్నానో ఆ రోజే నా సంతోషం జీవితం ముగిసిపోయినట్లు అనిపించింది.బాబీ సినిమా తర్వాత ఒక్కొక్క ప్రాజెక్టుకు ఐదు లక్షల ఇస్తామని ఆఫర్ చేశారు కానీ ఆ వయసులో కెరీర్ ప్రాధాన్యత అర్థం కాలేదు అని చెప్పుకొచ్చింది డింపుల్ కపాడియా.

రాజేష్ ఖన్నా తీవ్ర అనారోగ్యం కారణంగా 2012 జూలైలో మరణించిన విషయం తెలిసిందే.

తాజా వార్తలు