తాప్సీ నీకు ఏమైంది ?

ఇండస్ట్రీ లోకి వచ్చిన చాలా కాలం తరవాత స్టార్ హీరోయిన్ గా స్టేటస్ దక్కించుకుంది హీరోయిన్ తాప్సి.

హిట్ లు లేక పోయినా కూడా ఎదో రకంగా సినిమా రంగంలో కనిపిస్తూ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఛాన్స్ లు దక్కించుకుంటుంది.

గంగ - తమిళ సినిమా తో ఒక్క సారిగా బౌన్స్ బ్యాక్ అయ్యిన ఈమె ఇప్పుడు మంచి స్టార్ హీరోయిన్ గా టర్న్ అవుతోంది.వచ్చిన ఆఫర్లలో తనకు సూటబుల్ గా సెలెక్ట్ చేసుకుంది తాప్సీ.

కానీ వాటికి బైబై చెప్పేస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తోంది అందరినీ.

ఇప్పటికి మూడు ప్రాజెక్టులకు గుడ్ బై చెప్పిందంటే.

Advertisement

ఇలా ప్రాజెక్టుల నుంచి తప్పుకోవడం ఈమెకు ఎంతగా అలవాటు అయిందో అర్ధమవుతుంది.ఇప్పటికే నిఖిల్ మూవీ నుంచి తప్పుకున్న ఈ అమ్మడు తర్వాత సెల్వ రాఘవన్ సినిమాకి కూడా హ్యాండ్ ఇచ్చింది.

ఇప్పుడు సందీప్ కిషన్ కి ఇస్తూ.ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు చెప్పేసింది.

పిజ్జా సినిమాను ప్రొడ్యూస్ చేసిన సీవీ కుమార్.డైరెక్టర్ గా మారుతూ ఓ సినిమా చేస్తున్నాడు.

సైఫై థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ మూవీలో సందీప్ కిషన్ హీరోగా చేస్తుండగా హీరోయిన్ గా తాప్సీ ఒప్పుకుంది.కానీ సడెన్ గా డేట్స్ లేవంటూ ఈ సినిమా చేయలేనని చెప్పేసింది తాప్సీ.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
ఇంతకీ ఆ ముంబై భామలు తెలుగు సినిమాలు చేస్తారా?

అలాగని ఈమె చేతినిండా సినిమాలేం లేవు.ప్రస్తుతానికి దగ్గుబాటి రాణాతో ఘాజి ఒకటే చేస్తోంది తాప్సీ.

Advertisement

మరి ఇలా డేట్స్ లేవని చెబుతూ.వరుసగా సినిమాల నుంచి తప్పుకోవడానికి కారణం ఏంటో!

తాజా వార్తలు