బాలకృష్ణ మీద అలిగి కూర్చున్న బోయపాటి ?

అప్పట్లో బీ గోపాల్ - బాలకృష్ణ కాంబినేషన్ అంటే పిచ్చ క్రేజ్.

నరసింహ నాయుడు , సమరసింహా రెడ్డి ఈ రెండు సినిమాలూ చాలు వాళ్ళిద్దరి కాంబినేషన్ ఎంత పర్ఫెక్ట్ అనేది చెప్పాలి అంటే.

బాలయ్య ని సూపర్ గా చూపించడం లో బీ గోపాల్ కి సాటి లేరు అనుకునేవారు.కానీ బోయపాటి అంతకంటే పవర్ఫుల్ గా బాలకృష్ణ ని చూపించడం లో తనని తాని నిరూపించుకున్నారు.

బేసిక్ గా బాలకృష్ణ కీ, తెలుగు దేశం పార్టీ కీ వీరాభిమాని అయిన బోయాపాటి ప్రస్తుతం బాలకృష్ణ మీద అలిగారు అని తెలుస్తోంది.బాలకృష్ణ పక్కాగా బోళా గా ఉండే మనిషి ఆయన మాట్లాడే మాటలు ఒక్కొక్కసారి చాలా కన్ఫ్యూజన్ గా ఉంటాయి కూడా.

ఆ మధ్య కెసిఆర్ ని కలిసినప్పుడు 100 వ సినిమా సింగీతం తో ఉంటుంది అని బాలకృష్ణ స్వయంగా తెలపడం సంచలనం రేపింది.అది కూడా తన ఆదిత్యా 369 కి సీక్వెల్ గా ఆదిత్య 999 తీయబోతున్నా అని ఆ రోజు యధాపలంగా అనేసారు బాలయ్య.

Advertisement
కానీ ఎప్పటి నుంచో బాలయ్య వందో సినిమా అంటే బోయపాటే దర్శకుడు అని వినిపిస్తోంది.కానీ బాలయ్య ఇలా అనడం, చక చకా అన్ని మాధ్యమాల్లో పాకేసింది.

దాంతో బోయపాటి ఖంగుతిన్నారు.తనే రైట్ ఆప్షన్ అని అందరూ అంటున్న వేళ, బాలయ్య వేరే డైరక్టర్ పేరు చెప్పడం అన్నది ఆయనకు కాస్త అలక తెచ్చిందని వినికిడి.

అందుకే ఇప్పుడు ఆయన సైలెంట్ అయ్యారు అని అంటున్నారు.

భూములపై చంద్రబాబు దుష్ప్రచారం.. సీఎం జగన్ ఫైర్
Advertisement

తాజా వార్తలు