ఈసారి ఒలంపిక్స్ లో ఎంట్రీ అవుతున్న క్రీడలేవంటే..?!

కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద ఈవెంట్ అయిన ఒలింపిక్స్ నిర్వహిస్తున్నారు.టోక్యోలో ఒలింపిక్స్‌ మరో వారం రోజుల్లో మొదలవ్వనున్నాయి.

గత సంవత్సరం నిర్వహించాల్సినటువంటి ఈ ఆటలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి.జులై 23 నుంచి ఈ ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి.

ఒలింపిక్స్ కు భారత్ నుంచి 119 మంది అథ్లెట్లు హాజరుకానున్నారు.ఇందులో మొదటిసారిగా కొంత మంది టోక్యోకు ప్రయాణం కానున్నారు.

ప్రస్తుతం నిర్వహిస్తున్న టోక్యో ఒలింపిక్స్‌లో తొలిసారి కొన్ని ఆటలు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.మొత్తం ఆరు క్రీడలను టోక్యో ఒలింపిక్స్‌ లో కొత్తగా చేర్చారు.

Advertisement

ఇందులో రెండు గతంలో ఎగ్జిబిషన్ ఈవెంట్లుగా ఆడించినా ఏవో కారణాలతో వాటిని ఆపేశారు.మళ్లీ టోక్యో ఒలింపిక్స్‌ 2021లో పతకం సాధించే ఈవెంట్లలో ఈ ఆటలను చేర్చారు.టోక్యో ఒలింపిక్స్‌ లో ఈసారి కనిపించే ఆటల్లో ప్రధానమైంది బేస్‌బాల్‌ కూడా ఉంది.1992లో ఇది మెడల్ ఈవెంట్ గానే ఒలింపిక్స్‌లో ఉండేది.అయితే దీనిని 2008లో ఒలింపిక్స్ నుంచి తొలగించేశారు.

జపాన్‌ లో ఈ ఆట బాగా పాపులర్ అయ్యింది కూడా.

ప్రతీ సంవత్సరం జపాన్‌ లో జరిగే నిప్పన్ ప్రొఫెషనల్ బేస్‌ బాల్ లీగ్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆటగా పేరు సాధించింది.ఈ ఆటలో 6 దేశాలు తలపడనున్నాయి.మహిళల కోసం కూడా ఈ ఆటను ఒలింపిక్స్ లో చేర్చడం జరిగింది.

మహిళలు ఆడనున్న బేస్‌ బాల్‌ ను సాఫ్ట్ బాల్ పేరుతో పిలవననున్నట్లు తెలిపారు.టోక్యో ఒలింపిక్స్‌ లో మొదటిసారి ఎంట్రీ ఇవ్వబోతున్న మరో ఆట స్కేట్ బోర్డింగ్ ఆట అని చెప్పొచ్చు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

మహిళలు, పురుషుల విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించనున్నారు.పార్క్, స్ట్రీట్ రెండింటిలో మెడల్స్ ఇవ్వనున్నారు.

Advertisement

అలాగే సర్ఫింగ్‌ ని కూడా టోక్యో ఒలింపిక్స్‌ లో చేర్చారు.ఇకనుంచి ఈ క్రీడలను ఒలింపిక్స్‌ లో ఆడించేందుకు ప్లాన్ చేసినట్లు నిర్వాహాక కమిటీ పేర్కొంది.

రాక్ క్లైంబింగ్‌ ను కూడా తొలిసారి ఒలింపిక్స్‌ లో ప్రవేశ పెట్టారు.ఇక మరో ముఖ్యమైన ఆట కరాటేను కూడా ఈ సంవత్సరంలో ఒలింపిక్స్‌ లో చేర్చడం జరిగింది.

బాస్కెట్‌ బాల్‌ ను కూడా మొదటిసారిగా టోక్యో ఒలింపిక్స్‌ లో చేర్చడం జరిగింది.

తాజా వార్తలు