ఒత్తిడిగా ఉన్నప్పుడు ఎండలోకి వెళ్తే ఏమవుతుంది.. ఖచ్చితంగా తెలుసుకోండి!

ప్రస్తుత టెక్నాలజీ కాలంలో ప్రతి ఒక్కరి లైఫ్ ఎంత బిజీగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అనుకున్న గోల్ ను రీచ్ అవడం కోసం, డబ్బు సంపాదించడం కోసం, పేరు ప్రఖ్యాతలను పొందడం కోసం.

మనిషి టైం తో పాటే పరుగులు పెడుతున్నారు.అయితే ఒక్కోసారి మన మెదడు మరియు శరీరం పూర్తిగా అలసిపోతుంది.

అప్పుడే తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు.ఆ సమయంలో ఏ పని పైన దృష్టి పెట్టలేరు.

ఏకాగ్రత మొత్తం దెబ్బతింటుంది.

Advertisement

చాలా మంది ఒత్తిడి( Stress )నుంచి బయటపడేందుకు ఒక చోట కామ్ గా కూర్చోవడం లేక పడుకోవడం చేస్తుంటారు.కానీ ఇకపై అలా చేయకండి.తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు ఎండలోకి రండి.

ప్రకృతి అందించే ఈ చికిత్స వల్ల మీ సమస్యకు చాలా త్వరగా పరిష్కారం దొరుకుతుంది.ఎండలో ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాలు ఉంటే చాలు ఒత్తిడి చిత్తు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఎండలో ఉన్నప్పుడు సూర్య కిరణాలు( Sun rays ) శరీరాన్ని చురుగ్గా మారుస్తాయిఎండలో ఉండడం వల్ల మైండ్ రిఫ్రెష్ అవుతుంది.ఒత్తిడి దూరమై మెదడు పనితీరు మెరుగుపడుతుంద‌ట‌.

అలా అని ఎండ అధికంగా ఉన్న చోట నిల‌బ‌డితే క‌ళ్లు తిరుగుతాయి జాగ్ర‌త్త‌.ఎండ‌లో త‌క్కువ ఉండే ప్ర‌దేశంలో తిర‌గాలి.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!

అలాగే ఒత్తిడిగా ఉన్నప్పుడు తమలో తామే బాధపడటం కంటే కష్ట సుఖాలను ఇతరులతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నించాలి.అలా పంచుకోవడం వల్ల బాధతో పాటు ఒత్తిడి కూడా తగ్గుతుంది.

Advertisement

అందుకే ఒత్తిడిగా ఉన్నప్పుడు ఒంటరిగా కూర్చోవడం మానేసి స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలవండి వారికి మీ సమస్య ఏంటో చెప్పేందుకు ప్రయత్నించండి.

ఇక ఇటీవల కాలంలో చాలా మంది నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు.ఏదో ఒక పని చేస్తూ నిద్ర సమయాన్ని వృధా చేస్తున్నారు.కానీ మనిషి ఆరోగ్యమైన జీవితానికి నిద్ర కూడా ఒక ముఖ్యమైన వనరు.

కంటి నిండా నిద్ర ( Sleep )ఉంటేనే జబ్బులకు దూరంగా ఉంటారు.ముఖ్యంగా ఒత్తిడి దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.

అందుకే ఒత్తిడికి దూరంగా ఉండాలి అనుకుంటే రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు కచ్చితంగా నిద్రపోండి.

తాజా వార్తలు