ఫోన్‌ను ఎక్కువ‌గా వాడితే గర్భిణీల్లో ఆ స‌మ‌స్యలు రావ‌డం ఖాయ‌మ‌ట‌!

ప్ర‌స్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగం ఏ స్థాయిలో పెరిగిందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.ప‌సి పిల్ల‌ల నుంచి పండు ముస‌లి వ‌ర‌కు.

అంద‌రి చేతిలో స్మార్ట్‌ఫోన్ ద‌ర్శ‌న‌మిస్తోంది.అయితే ఎవ‌రు వాడినా వాడ‌క‌పోయినా.

గ‌ర్భిణీ స్త్రీలు మాత్రం స్మార్ట్ ఫోన్ల‌కు ఎంత దూరంగా ఉంటే త‌ల్లికి, పుట్ట‌బోయే బిడ్డ‌కు అంత మంచిద‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.అస‌లు గ‌ర్భిణీలు ఫోన్‌ను ఎక్కువ‌గా వాడితే ఏం అవుతుంది.?ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి.? వంటి విష‌యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ప్రెగ్నెన్సీ అనేది పెళ్లైన ప్ర‌తి స్త్రీ జీవితంలోనూ ఎంతో మ‌ధ‌ర‌మైన ఘ‌ట్టం.

ఆ స‌మ‌యంలో స్త్రీలు ఎంతో సున్నితంగా ఉంటారు.అలాగే పుట్ట‌బోయే బిడ్డ కోసం అనేక జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు.

Advertisement

కానీ, గ‌ర్భిణీలు చేసే అతి పెద్ద పొర‌పాటు. ముబైల్‌ను ఓవ‌ర్‌గా యూజ్ చేయ‌డం.

టైమ్ పాస్ కోసం లేదా ఇత‌రితర కార‌ణాల వ‌ల్లో స్మార్ట్ ఫోన్‌ను విప‌రీతంగా వాడుతుంటారు.అయితే గంట‌లు గంట‌లు ఫోన్‌ను చూడ‌టం లేదా ఫోన్‌లో మాట్లాడ‌టం వ‌ల్ల‌.

అందులోంచి విడుద‌ల‌య్యే రేడియేషన్ క‌డుపులోని శిశువు ఎదుగుద‌ల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేస్తుంది.శిశువుకు పుట్టుక లోపాలు వ‌చ్చే ప్ర‌మాదం పెరిగిపోతుంది.

అలాగే ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో ఫోన్‌ను అధికంగా వాడ‌టం వ‌ల్ల నిద్ర‌లేమి, త‌ల‌నొప్పి, ఒత్తిడి వంటి స‌మ‌స్య‌ల‌ను స్త్రీలు ఫేస్ చేయాల్సి ఉంటుంది.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

స్మార్ట్ ఫోన్‌ను అతిగా యూజ్ చేయ‌డం వ‌ల్ల తీవ్ర‌మైన మెడ నొప్పి, క‌ళ్లు పొడిబారిపోవ‌డం, కంటి చూపు త‌గ్గ‌డం వంటివి ఎదుర‌వుతాయి.ఇక చ‌ర్మం సైతం ఎఫెక్ట్ అవుతుంది.ముఖ్యంగా ముడ‌త‌లు, ఫైన్ లైన్స్, డార్క్ స‌ర్కిల్స్ వంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి.

Advertisement

అందుకే ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో వీలైనంత వ‌ర‌కు ఫోన్‌ను వినియోగించ‌డం త‌గ్గించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

తాజా వార్తలు