ఏమయిందిరా.. 46 పరుగులకే కుప్పకూలిన టీమిండియా

బెంగళూరు వేదికగా జరుగుతున్న ఇండియా, న్యూజిలాండ్ (India, New Zealand)మొదటి టెస్ట్ లో భాగంగా మొదటి రోజు వర్షం కారణంగా పూర్తి ఆట రద్దుకాగా.

రెండో రోజు టాస్ గెలిచిన టీం ఇండియా (Team India) బ్యాటింగ్ చేసింది.

అయితే టీమిండియా బ్యాటర్లకు ఏమైందో ఏమో తెలియదు కానీ వరుస పెట్టి పెవిలియన్ చేరారు.ఇందులో భాగంగా ఏకంగా ఐదు మంది టీమిండియా బ్యాట్స్మెన్లు డక్ అవుట్ అయ్యారు.

వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేసిన 20 పరుగులు ఇన్నింగ్స్ లో అత్యధికంగా ఓ బ్యాట్స్మెన్ చేసిన పరుగులు.టీమిండియా కేవలం 31.2 ఓవర్లలో 46 పరుగులకే కుప్పకూలింది.

ఇది ఇలా ఉండగా.టీమిండియాలో మొత్తం ఐదుగురు బ్యాట్స్మెన్స్ ఖాతా తెరవకుండానే వెను తిరిగారు.ముఖ్యంగా సొంత గ్రౌండ్ గా భావించే విరాట్ కోహ్లీ(Virat Kohli) కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.

Advertisement

టీమిండియా స్కోర్ 9 పరుగుల వద్ద రోహిత్ శర్మ(Rohit Sharma) కేవలం రెండు పరుగులతో పెవిలియన్ చేరినప్పటి నుంచి మొదలైన వికెట్ల పతనం ఆ తర్వాత కొనసాగుతూనే ఉంది.ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, కె.ఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవీంద్రన్ అశ్విన్ (Sarfaraz Khan, KL Rahul, Ravindra Jadeja, Ravindran Ashwin)అందరూ డక్ అవుట్ అయ్యారు.బంగ్లాదేశ్ సిరీస్లో సెంచరీ సాధించిన రవిచంద్రన్ అశ్విన్ కూడా గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు.

ఇక మరోవైపు న్యూజిలాండ్ బౌలర్లు(New Zealand bowlers) టీమిండియా ఆటగాళ్లను ముప్పు తిప్పలు పెట్టారు.ముగ్గురు ఫేస్ బౌలర్లు టీమిండియా పతనానికి కారణమయ్యారు.ముఖ్యంగా మ్యాట్ హెన్రీ ఐదు వికెట్లు తీసి టీమిండియా పతనానికి కారకుడయ్యాడు.

అలాగే విలియం రూట్ కూడా నాలుగు వికెట్లు తీయగా.టీం సౌతి ఒక వికెట్ తీశాడు.

దీంతో నేడు టీమిండియా టెస్టుల్లో మూడో అత్యల్ప స్కోరును నమోదు చేసుకుంది.ఇదివరకు 2020లో ఆస్ట్రేలియాతో 36 పరుగులకు, 1974లో ఇంగ్లాండ్తో 42 పరుగులకు టీమిండియా ఆల్ అవుట్ అయింది.

కొబ్బరి నీళ్లల్లో ఇవి కలిపి రాసారంటే మీ ముఖం మరింత ప్రకాశంవంతంగా మెరిసిపోవడం ఖాయం..!
'మన హక్కు హైదరాబాద్' అంటూ కర్టెన్ రైజర్ ప్రచార గీతం..

చూడాలి మరి టీమిండియా బౌలర్లను న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్ ఎలా ఎదుర్కొంటారో.

Advertisement

తాజా వార్తలు