మానవ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో.. ఈ పోషకాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి..!

40 సంవత్సరాల తర్వాత శరీరాన్ని దృఢంగా ఉంచడమే కాకుండా వివిధ వ్యాధులను దూరం చేయడానికి ఈ ఆహార పదార్థాలు ఎంతగానో ఉపయోగపడతాయి.

శరీరంలో విటమిన్ మరియు ఖనిజాల లోపాన్ని పౌష్టిక ఆహారం తీసుకోవడం వల్ల దూరం చేసుకోవచ్చు.

కాబట్టి డైట్ ను పాటించడం ఎంతో ముఖ్యం.అధిక స్థాయిలో ఈ మూలకాలను కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ఎంతో మంచిది.

మీకు కావాలంటే మీరు సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు.అయినప్పటికీ సహజంగా లభించే విటమిన్లు మరియు ఖనిజాల కంటే సప్లిమెంట్లను తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్యకరమైన ఆహారం( Healthy Food ) శరీరానికి పోషణలను అందిస్తుంది.ఏ పోషకాహార లోపం వల్ల ఏ సమస్య వస్తుందో దానికి ఏ ఆహారం అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

విటమిన్ సి( Vitamin C ) లోపం వల్ల చిగుళ్లలో రక్తస్రావం అవుతుంది.దీనికోసం సిట్రిక్ పండ్లు మరియు కూరగాయలను ఆహారంలో తీసుకోవడం మంచిది.

దీనికోసం మీరు ఆరెంజ్, స్ట్రాబెరీ, జామ, కివి, నిమ్మ, బొప్పాయి, ఉసిరి, టమోటా, క్యాప్సికం, క్యాలీఫ్లవర్, బ్రకోలి ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.అంతే కాకుండా విటమిన్ డి( Vitamin D ) మన శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది.ముఖ్యంగా చెప్పాలంటే మధుమేహం, గుండెపోటు, మల్టిపుల్ స్క్లెరోసిస్, బెస్ట్ మరియు కొలొరెక్టల్ క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించడంలో ఈ విటమిన్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

సాధారణంగా ఇది చేపలు, పాల ఉత్పత్తలలో లభిస్తుంది.

కాళ్ల తిమ్మిరిని అసలు నిర్లక్ష్యం చేయకూడదు.ఎందుకంటే ఇది మెగ్నీషియం( Magnesium ) లోపం వల్ల కూడా ఏర్పడవచ్చు.ఈ ఖనిజం కండరాల సకోచాన్ని నియంతిస్తుంది.

వైయస్సార్ బీమా పథకం పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం..!!
మీరు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోండి..

ఈ లోపాన్ని నియంత్రించాలంటే గుమ్మడికాయ గింజలు, కొవ్వు చేపలను, ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.ఇంకా చెప్పాలంటే పొటాషియం అధికంగా కలిగిన ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల స్ట్రోక్ ముప్పు తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

అలాగే అరటి పండ్లు, మెత్తని బంగాళదుంపలు, పెరుగు మరియు బీన్స్ లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.

తాజా వార్తలు