కనుదిష్టి తలిగితే జరిగే నష్టాలు... వాటి నివారణ పద్ధతులు ఏంటో తెలుసా?

ప్రస్తుత కాలంలో చాలా మంది మూఢనమ్మకాలకు స్వస్తి పలికారు.అలాంటి మూఢనమ్మకాలు ఏవీ ఉండవు అంతా విధి రాత ప్రకారమే జరుగుతుందని భావిస్తూ ఉంటారు.

అయితే కొంత మంది కొన్ని నమ్మకాలను ఎంతో విశ్వసిస్తారు.ఈ క్రమంలోనే ఏదైనా మనకు చెడు జరిగినప్పుడు కచ్చితంగా చెడు దృష్టి ప్రభావమే కలిగిందని భావించి కొన్ని రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు.

ముఖ్యంగా కనుదిష్టి తగిలితే మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.మరి కనుదిష్టి వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి వాటిని ఏవిధంగా పరిష్కరించాలనే విషయంపై ఇక్కడ తెలుసుకుందాం.

మనం ఆర్థికంగా ఉన్నతంగా ఉన్నప్పుడు మన కుటుంబంతో సుఖసంతోషాలతో ఉన్నప్పుడు మన సంతోషాన్ని ఇతరులు ఓర్వలేక చూసే చెడు దృష్టిని కను దిష్టి అంటారు.ఈ కనుదృష్టి మనపై పడినప్పుడు ఇంట్లో ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తడం, ఆర్థిక ఇబ్బందులు వెంటాడటం వంటివి జరుగుతాయి.

Advertisement

ఇలా కన్ను దిష్టి తగిలినప్పుడు సముద్రపు నీటిని స్వచ్ఛమైన గుడ్డలో వడపోసి ఆ నీటిని ఒక సీసాలో భద్రపరుచుకోవాలి.ఇలా భద్రపరిచిన నీటిని పౌర్ణమి పాడ్యమి రోజులలో ఇల్లు మొత్తం చిలకరించాలి.

అదేవిధంగా వ్యాపారాలు చేసే చోట మన వ్యాపార రంగంపై ఇతరుల చెడు ప్రభావం పడటం వల్ల వ్యాపార అభివృద్ధి కలగదు.ఈ సమయంలో ఒక గాజు గ్లాసులో నీటిని వేసి అందులో నిమ్మకాయ వేసి వచ్చిపోయే వారికి కనిపించేవిధంగా దానిని ఉంచాలి.అయితే ప్రతి శనివారం నిమ్మకాయలు మారుస్తూ ఉండాలి.

ఇక పుట్టిన పిల్లలపై కూడా ఈ విధమైనటువంటి ప్రభావం పడుతుంది.దీంతో పిల్లలు నిద్ర పోకుండా ఏడవడం, ఆకలి లేకుండా ఉంటుంది.

ఇలా పిల్లలు తరచూ ఏడుస్తూ ఉంటే వెంటనే వారికి ఉప్పుతో దిష్టి తీసి ఉప్పు నీటిలో వేయాలి.ఆ ఉప్పు కరిగేలోపు పిల్లల పై ఉన్న దిష్టి తొలగిపోతుందని పెద్దలు చెబుతుంటారు.

మీ వెన్నెముక బ‌లంగా ఉండాలా? అయితే ఈ జాగ్ర‌త్తలు తీసుకోవాల్సిందే!
Advertisement

తాజా వార్తలు