పసిపిల్లల ఏడుపుకు అర్థం ఏంటో మీకు తెలుసా..!

మన ఇంట్లో ఉండే పసిపిల్లలు ఏదో ఒక విషయం లో ఏడుస్తూ ఉంటారు.వాళ్ల భావోద్వేగాలను తెలిపేందుకు కూడా ఏడ్పుతోనే చూపిస్తారు.

పసిపిల్లల ఏడుపులు తల్లిదండ్రులకు అర్థం కాక.వెంటనే కంగారుపడి ఆసుపత్రికి తీసుకు వెళుతుంటారు.కాగా పసిపిల్లల ఏడుపు వెనుక కొన్ని భావోద్వేగాలు ఉంటాయని వైద్య నిపుణులు తెలిపారు.

చైల్డ్ సైకాలజీ నిపుణులు వాళ్లు చేసిన అధ్యయనం లో పసి పిల్లల ఏడుపు గురించి కొన్ని విషయాలు తెలిపిన ప్రకారం.పసి పిల్లలు ఏడవటం సహజం.వారికి మాట్లాడటం రాదు కాబట్టి వాళ్ళు తమకు కావాల్సిన వస్తువులకు, వాళ్ళ ఆకలికి, ఇతర కడుపు నొప్పి సమస్య లను నోటితో చెప్పే స్థాయి లేనందున వారి అవసరాలను ఏడుపు తోనే తెలుపుతారని వైద్య నిపుణులు తెలిపారు.

అంతేకాకుండా పసి పిల్లలు గంటలపాటు అదేపనిగా ఏడుస్తున్నారంటే వాళ్లకు కడుపులో నొప్పి ఉంటుందని తెలిపారు.

Advertisement

పిల్లలకు ఆకలి వేసినప్పుడు కొంచెం పెద్దగా ఏడుస్తూ.మధ్యలో విరామం ఇవ్వకుండా ఆకలి కోసం ఏడుస్తూనే ఉంటారు.వారికి వారు ఉన్నచోట ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు లేదా అసౌకర్యం గా ఉన్నప్పుడు ఒకే సారి గట్టిగా ఏడుస్తుంటారు.

అంతేకాకుండా వారికి ఏదైనా నొప్పి పుట్టినప్పుడు బిగ్గరగా ఏడుస్తూ గంటల పాటు ఏడుస్తూనే ఉంటారు.అలా నిమిషం కూడా వదలకుండా ఏడుస్తూనే ఉంటే వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లాలని వైద్యునితో చికిత్స అందించాలని నిపుణులు తెలుపుతున్నారు.

అలా కాకుండా పసిపిల్లలకు ఎవరి దగ్గర కైనా వెళ్లాలనిపిస్తే లేదా వాళ్లను తమ దగ్గరకు రప్పించుకోవడానికి అయినా తాము ఉ.ఊ.అంటూ మూలుగుతూ ఏడుస్తుంటారు.వాళ్లకు నిద్ర వచ్చే ముందు కూడా ఒకరకంగా మూలుగుతూ ఏడుస్తూ నిద్రలోకి జారుకుంటారని వైద్య నిపుణులు చేసిన పరిశోధనలో తేలింది.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..
Advertisement

తాజా వార్తలు