అరికాళ్ళ నొప్పికి కార‌ణాలేంటి.. నివార‌ణ ఎలా?

అరికాళ్ళ నొప్పి( Foot Pain ) అనేది చాలా మందికి ఎదురయ్యే సాధారణ సమస్య.కొంద‌రిలో ఇది తాత్కాలికంగా ఉండొచ్చు.

మ‌రికొంద‌రిలో దీర్ఘకాలికంగా మారొచ్చు.హీల్స్ ఎక్కువగా వాడటం, స‌రిప‌డ‌ని షూస్ వాడటం, అధిక బ‌రువు, ఫ్రాక్చర్, లేదా లిగమెంట్ డ్యామేజ్, ఎక్కువ నడక, పరుగులు తీయడం, ఎక్కువసేపు నిలబడడం, డయాబెటిస్, ఆర్థరైటిస్, బ్లడ్ సర్క్యులేషన్ స‌రిగ్గా జ‌ర‌గ‌క‌పోవ‌డం త‌దిత‌ర అంశాలు అరికాళ్ళ నొప్పికి కార‌ణం అవుతుంటాయి.

అయితే ఈ స‌మ‌స్య నివార‌ణ‌కు కొన్ని ఇంటి చిట్కాలు తోడ్ప‌డ‌తాయి.ఒక టబ్‌లో గోరువెచ్చని నీటిని తీసుకొని, చిటికెడు ఉప్పు( Salt ) లేదా ఎప్సమ్ సాల్ట్ క‌లిపి.

అందులో ప‌దిహేను నిమిషాలు పాదాల‌ను ముంచండి.ఈ ప్రక్రియ‌ రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తుంది.

Advertisement

అలాగే నైట్ నిద్రించే ముందు కొబ్బరినూనె,( Coconut Oil ) ఆముదం నూనె లేదా నువ్వుల నూనెను కొద్దిగా వేడి చేసి పాదాల‌ను అప్లై చేయండి.కనీసం ప‌ది నిమిషాల పాటు మ‌సాజ్ చేసుకోవాలి.రెగ్యుల‌ర్ గా ఇలా చేశారంటే అరికాళ్ళ నొప్పులు దూరం అవుతాయి.

అల్లం మ‌రియు పసుపు పానీయం అరికాళ్ళ నొప్పి నివారణిగా ప‌ని చేస్తుంది.ఒక గ్లాస్ వాట‌ర్ లో పావు టీ స్పూన్ ప‌సుపు, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం తురుము వేసి మ‌రిగించి.

ఆ నీటిని నిత్యం తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

ఇక ఈ ఇంటి చిట్కాల‌ను పాటించ‌డంతో పాటు సరైన చెప్పులు మ‌రియు షూస్ వాడటం అల‌వాటు చేసుకోండి.హై హీల్స్( High Heels ) ఎవైడ్ చేయండి.కండరాలను బలపరిచే స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయండి.

ఒంటికి చ‌లువ‌ని స‌మ్మ‌ర్‌లో పెరుగు తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి!
శ్రీకాంత్ ఓదెల చిరంజీవి సినిమాతో భారీ సక్సెస్ కొడతాడా..?

కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉండే పాలు, బాదం, అర‌టి పండు, వాల్ న‌ట్స్‌, సీడ్స్ తీసుకోండి.గోధుమ, మొలకెత్తిన ధాన్యాలు, ఆకుకూరలు ఎక్కువగా తినడం మంచిది.

Advertisement

ఉప్పు వాడ‌కం త‌గ్గించండి.ఒత్తిడికి దూరంగా ఉండండి.

డ‌యాబెటిస్ ను అదుపులో ఉంచుకోండి.మ‌రియు ఓవ‌ర్ వెయిట్ ను క‌లిగి ఉంటే బ‌రువు త‌గ్గేందుకు ప్ర‌య‌త్నించండి.

తాజా వార్తలు