వైట్ రైస్ కు ప్రత్యామ్నాయం కాలీఫ్లవర్ రైస్‌.. అస‌లు దీని ప్ర‌త్యేక‌త ఏంటో తెలుసా?

కాలీఫ్లవర్ రైస్( Cauliflower rice ) ఇటీవ‌ల కాలంలో బాగా వినిపిస్తున్న పేరు.

నేటి ఆధునిక కాలంలో అధిక బరువు, కొలెస్ట్రాల్, డయాబెటిస్ వంటి జబ్బులు చాలా కామన్ గా మారాయి.

ప్రపంచవ్యాప్తంగా వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మంది ఇటువంటి జబ్బులకు బాధితులుగా మారుతున్నారు.ఈ క్రమంలోనే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు హెల్తీ డైట్ ను మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

పోషకాలతో కూడిన ఆహారం వైపు మొగ్గు చూపుతున్నారు.ఇందులో భాగంగానే వైట్ రైస్ కు ప్రత్యామ్నాయాలు ఎంచుకుంటున్నారు.

అయితే కాలీఫ్లవర్ రైస్ కూడా వైట్ రైస్ కు ఒక ప్రత్యామ్నాయం.దీనిని కాలీఫ్లవర్‌ను ముక్కలు చేయడం లేదా తురుమడం ద్వారా తయారు చేస్తారు.

Advertisement

కాలీఫ్ల‌వ‌ర్ రైస్ బియ్యం యొక్క రూపాన్ని మరియు అనుభూతిని కలిగి ఉంటుంది.పైగా వైట్ రైస్ తో( White rice ) పోలిస్తే కాలీఫ్ల‌వ‌ర్ రైస్‌లో కేలరీలు, పిండి పదార్థాలు త‌క్కువ‌గా.

విటమిన్లు మరియు ఖనిజాలు ఎక్కువ‌గా నిండి ఉంటాయి.అందుకే చాలా మంది వైట్ రైస్ కు బ‌దులుగా కాలీఫ్ల‌వ‌ర్ రైస్ ను ఎంచుకుంటున్నారు.

కాలీఫ్ల‌వ‌ర్ రైస్ లో ప్రోటీన్‌, ఫైబ‌ర్‌, విట‌మిన్ సి, విట‌మిన్ కె, ఫోలేట్‌, విట‌మిన్ బి6, మాంగనీస్, పొటాషియం వంటి పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి.

తక్కువ క్యాలరీలు, ఎక్కువ వాట‌ర్ కంటెంట్ ఉండ‌టం వ‌ల్ల కాలీఫ్ల‌వ‌ర్ రైస్‌ బరువు తగ్గడానికి తోడ్ప‌డుతుంది.కాలీఫ్ల‌వ‌ర్ రైస్‌ ఆకలి కోరిక‌ల‌ను తగ్గిస్తుంది.మరియు ఎక్కువ గంట‌ల పాటు క‌డుపును నిండిగా ఉంచుతుంది.

ఫ్రీ టైమ్‌లో నన్ను చూసి నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతా : నాని
ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?

అలాగే కాలీఫ్లవర్ రైస్‌లోని ఫైబర్ మీ జీర్ణాశయంలోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పోషించడంలో సహాయపడుతుంది.మ‌రియు జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది

Advertisement

కాలీఫ్ల‌వ‌ర్ రైస్ ను డైట్ లో చేర్చుకోవ‌డం వ‌ల్ల టైప్ 2 డ‌యాబెటిస్‌( Type 2 diabetes ), క్యాన్సర్, గుండె జబ్బులు వంటి అనారోగ్యాల ప్రమాదం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.కాలీఫ్ల‌వ‌ర్ రైస్ లో గ్లూకోసినోలేట్ మరియు ఐసోథియోసైనేట్ అనే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి.

శరీర ఆరోగ్యాన్ని కాపాడ‌తాయి.

తాజా వార్తలు