రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు:జిల్లా ఎస్పీ చందనా దీప్తి

నల్లగొండ జిల్లా:జిల్లాలోరోడ్డు ప్రమాదాల( Road accidents ) నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, వాహనచోదకులు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పి చందన దీప్తి( District SP Chandana Deepti ) ఒక ప్రకటనలో తెలిపారు.రోడ్డు ప్రమాదాల ప్రమాదాలు ఎక్కువగా జరిగే నేషనల్ హైవే,స్టేట్ హైవేల పైన యాక్సిడెంట్‌ ఫ్రోన్‌,బ్లాక్ స్పాట్ ఏరియాలను గుర్తించి, రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు.

 Special Measures To Prevent Road Accidents: District Sp Chandana Deepti , Sp Cha-TeluguStop.com

ప్రధాన చౌరస్తాలో రేడియం స్టిక్కర్లతో కలిగిన భారీ కేడ్లను,కీలకమైన కూడళ్ళ వద్దలైటింగ్, స్పీడు నియంత్రణ కోసం మలుపుల దగ్గర సూచికలు,బ్లింకింగ్‌ లైట్స్‌, బోలర్స్ ఏర్పాటు చేస్తూ, ప్రమాదాల నివారణ చర్యలు తీసుకుంటున్నామని,రాత్రి సమయంలో రహదారిపై వాహనాలు నిలిపి ఉండడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున నిరంతరం పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ రోడ్డుపై ఎలాంటి వాహనాలు నిలవకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

వాహనదారులకు,ప్రజలకు రోడ్డు ప్రమాదాల నివారణ పట్ల అవగాహన కల్పించి రోడ్డు భద్రత పట్ల చైతన్య పరస్తున్నామని,ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన క్షతగాత్రులను దగ్గరలోని హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు.

ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులను సమన్వయంతో ప్రమాదాల నివారణ చర్యలు తీసుకుంటామని, వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని సూచించారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube