రెండో వన్డే మ్యాచ్ లో భారత్ ను చిత్తుగా ఓడించిన వెస్టిండీస్..!

భారత జట్టు మొదటి వన్డే మ్యాచ్లో వెస్టిండీస్( West Indies ) పై ఘన విజయం సాధించి, రెండో వన్డే మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది.రెండో టెస్ట్ మ్యాచ్లో అటు బ్యాటింగ్ లోను, ఇటు ఫీల్డింగ్ లోను చెత్త ఆటను ప్రదర్శించింది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 40.5 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది.భారత బ్యాటర్లైన ఇషాన్ కిషన్ 55 బంతుల్లో ఆర్ ఫోర్లు, ఒక సిక్స్ తో 55 పరుగులు చేసి రాణించాడు.

శుబ్ మన్ గిల్( Shubman Gill ) 49 బంతుల్లో 5 ఫోర్ లతో 34 పరుగులు చేసి రాణించాడు.మిగిలిన బ్యాటర్లు చెప్పుకోదగ్గ పరుగులు నమోదు చేయలేక పోయాయి.

దీంతో భారత జట్టు మిడిల్ ఆర్డర్ గోరంగా విఫలమైందనే చెప్పాలి.

వెస్టిండీస్ బౌలర్ అయిన రోమారియో షెఫర్డ్, గుడకేశ్ మోతీ చెరో మూడు వికెట్లు తీసి భారత జట్టును దెబ్బతీశారు.అల్జారి జోసెఫ్ రెండు వికెట్లు తీశాడు.అనంతరం 182 పరుగుల స్వల్ప లక్ష్య చేదనకు దిగిన వెస్టిండీస్ జట్టు 36.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించి ఘన విజయం సాధించింది.వెస్టిండీస్ బ్యాటర్లైన కెప్టెన్ shaihope 63 నాట్ అవుట్, కార్టీ 48 పరుగులతో రాణించారు.

Advertisement

భారత బౌలర్ అయిన శార్దూల్ ఠాగూర్ మూడు వికెట్లు, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీశారు./br>

ఈ ఘోర పరాజయంపై భారత జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా( Hardik Pandya ) స్పందిస్తూ.ఈ ఓటమి తమని ఎంతగానో నిరాశపరిచిందని తెలిపాడు.బ్యాటింగ్లో తమ జట్టు ఘోరంగా విఫలం అయిందని తెలిపాడు.

తమ జట్టులో ఇషాన్ కిషన్ అద్భుత బ్యాటింగ్ చేశాడని కొనియాడాడు.ప్రస్తుతం సిరీస్ 1-1 తో సమానమైంది.

ఆఖరి వన్డే మ్యాచ్లో గెలిచి సిరీస్ ని సొంతం చేసుకుంటామని హార్థిక్ పాండ్యా తెలిపాడు.

డ్రై ఫ్రూట్స్ తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
Advertisement

తాజా వార్తలు