గుడిసె లేని తొలి నియోజకవర్గంగా సిరిసిల్లను తీర్చిదిద్దనున్నాం - మంత్రి కేటిఆర్

సమైక్య రాష్ట్రంలో సిరిసిల్ల ఎట్లుందో, స్వరాష్ట్రంలో తొమ్మిదిన్నర ఎండ్లలో సిరిసిల్ల ఎంత తెలివైందో తీరిగ్గా ఆలోచించాలని మంత్రి కే టి ఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సాగు, త్రాగు, విద్యుత్, విద్య, వైద్యం రంగాలలో వచ్చిన సానుకూల మార్పులు అర్థం చేసుకోవాలన్నారు.

కష్ట,సుఖాల్లో ప్రభుత్వ సహకారం ను గుర్తు తెచ్చుకోవాలని చెప్పారు.మభ్యపెట్టే మాటలను నమ్మొద్దని ప్రభుత్వానికి ప్రజలు వెన్నుదన్నుగా నిలవాలని కోరారు.

మంగళవారం సిరిసిల్ల లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం అవరణలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక చేయూత, డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ, గృహలక్ష్మీ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను, స్పోర్ట్స్ కిట్ లను రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ తో కలిసి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి కే టి ఆర్ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు .స్వరాష్ట్రం తెలంగాణలో ప్రజలే కేంద్ర బిందువుగా , ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా ప్రభుత్వం తొమ్మిదిన్నర ఎండ్లుగా పాలన సాగిస్తున్నామని తెలిపారు.ప్రతి పథకం ఫలాలు పేద కుటుంబాల్లోనీ చివరి గడపకూ పారదర్శకంగా చేరేందుకు అకింత భావంతో కృషి చేస్తున్నామన్నారు.

తెలంగాణ లోని మొట్టమొదటి గుడిసె లేని నియోజవర్గం గా సిరిసిల్లను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.అందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లాలో గుడిసెలు, ఇండ్లు లేని, శిథిలావస్థ లో ఉన్న ఇండ్లను గుర్తించమని జిల్లా కలెక్టర్ ను ఆదేశించిన వెంటనే.

Advertisement

క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టి ఫొటోలు, జీయో కో ఆర్డినేటర్ తో సహా 1747 మందిని కలెక్టర్ గుర్తించారని అన్నారు.వారికి గృహలక్ష్మి కింద ప్రాధాన్యం ఇచ్చి ఇండ్ల నిర్మాణం కు ఆర్థిక సహాయం అందజేయ నున్నట్లు తెలిపారు.

సిరిసిల్ల పట్టణంలో 2,800 మందినీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయించేందుకు అర్హులుగా తేల్చగా.వీరిలో 1260 మందికి మండేపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ను ఇప్పటికే కేటాయించామన్నారు.577 మంది లబ్ధిదారులకు పేద్దూరు, రగుడు లలో డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయించి ఈ కార్యక్రమంలో పట్టాలను అందజేస్తున్నట్లు తెలిపారు.డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, గృహాలక్ష్మి లబ్ధిదారులు పోనూ ఇంకా మిగిలి ఉంటే అధైర్య పడవద్దని.

సిఎం కేసిఆర్ కాళ్ళు మొక్కైన గృహాలక్ష్మి మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గ ప్రజలకు ప్యాకేజీ-9 కల్పతరువు అని పేర్కొన్న మంత్రి.

ఇప్పటికే మల్కపేట రిజర్వాయర్ పూర్తి చేశామని చెప్పారు.సిఎం కేసిఆర్ టైం తీసుకుని వారం రోజుల్లో ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?
చాట్‌జీపీటీ ఉపయోగించి 40 నిమిషాల్లో అదిరిపోయే యాప్ క్రియేట్ చేశాడు.. కానీ..?

ఒక్కరైన లంచం ఇచ్చారా.వేదిక నుంచి లబ్ధిదారులను ప్రశ్నించిన మంత్రి కే టి ఆర్ డబుల్ బెడ్ రూమ్, గృహ లక్ష్మి లబ్ధిదారులు ఒక్కరైన ప్రజా ప్రతినిధులు , అధికారులకు లంచం ఇచ్చారా.

Advertisement

అని వేదిక నుంచి లబ్ధిదారులను మంత్రి కే టి ఆర్ ప్రశ్నించారు.ఎవ్వరికీ రూపాయి లంచం ఇవ్వలేదని, అడగలేదని తేల్చి చెప్పిన లబ్ధిదారులు సమాధానం ఇచ్చారు.

ప్రభుత్వ పారదర్శక పాలనకు ఇదే నిదర్శనమని చెప్పారు.స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం వల్లే డబుల్ బెడ్ రూం ఇండ్లను త్వరగా పూర్తి చేసి పారదర్శకంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించామని చెప్పారు.

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ.ఈ రోజు పేద కుటుంబాలకు శుభదినం అని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక చేయూత, డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ, గృహలక్ష్మీ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను, స్పోర్ట్స్ కిట్ లను మంత్రుల చేతుల మీదుగా అందజేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ లు జిందం కళా చక్రపాణి, రామతీర్థపు మాధవి గ్రంధాలయ సంస్థ చైర్మన్ అకునూరి శంకరయ్య,రాష్ట్ర పవర్ లూమ్, టెక్స్ టైల్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్, జిల్లా రైతు బంధు చైర్మన్ గడ్డం నర్సయ్య, సెస్ ఛైర్మన్ చిక్కాల రామారావు, కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి, ఆర్డీఓ ఆనంద్ కుమార్, ప్రత్యేక ఉప కలెక్టర్ బి గంగయ్య,స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Latest Rajanna Sircilla News