Surya kiran : నేను విడాకులు వద్దు అని కళ్యాణి కి చెప్పే స్థాయిలో లేను : సుజిత

నటి సుజిత ను ఈ మధ్య కాలంలో సీరియల్స్ లో బాగా చూస్తున్నాం.

ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎక్కువగా చెల్లి పాత్రల్లో నటించింది.

ఇక సీరియల్స్ విషయానికి వస్తే 50 కి పైగా సీరియల్స్ లో లీడ్ రోల్ చేసింది.అందుకే ఆమెకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది.

మొన్నటికి మొన్న వదినమ్మ అనే సీరియల్ లో కనిపించిన సుజిత ఇప్పుడు మరొక సీరియల్ తో రాబోతుంది.ఇక సుజిత వ్యక్తి గత జీవితం విషయానికి వస్తే ఆమె అన్నయ్య సూర్య కిరణ్( Surya kiran ) గురించి ఇండస్ట్రీ మొత్తం తెలిసిందే.

అయన తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించి ఇటీవల బిగ్ బాస్ సీజన్ లో కూడా పాల్గొన్నాడు.

We Coudnt Make Possible For Kalyani And Surya Kiran
Advertisement
We Coudnt Make Possible For Kalyani And Surya Kiran-Surya Kiran : నేను

అయితే అయన హీరోయిన్ కళ్యాణి( kalyani ) తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు.కానీ సినిమాల ప్రొడక్షన్ పెద్ద ఎత్తున చేసి ఉన్న డబ్బు తో పాటు అంతకు ముందు ఉన్న ఆస్తులను కూడా సినిమాల కోసం పోగొట్టుకున్నాడు.కానీ ఆలా డబ్బు పోయి అప్పుల వాళ్ళు మీద పడే సరికి భార్య భర్తలకు గొడవలు పెరిగిపోయాయి.

ఈ దశ లో సూర్య కిరణ్ తాగుడుకు బానిస కావడం తో కళ్యాణి కూడా దూరం పెట్టింది.ఆ తర్వాత కొన్నాళ్ళకు విడాకులు తీసుకొని ఎవరి దారి వారు చూసుకున్నారు.

అయితే ఈ విషయంలో ఎవరి తప్పు లేదని , ఒకేసారి పెద్ద ప్రొడక్షన్ చేయకుండా చిన్న చిన్న గా మొదలు పెట్టి ఆ తర్వాత పెద్ద పనులు చేస్తే బాగుండేది అని సూర్య కిరణ్ చెల్లి సుజిత( Sujitha ) భావిస్తున్నారు.

We Coudnt Make Possible For Kalyani And Surya Kiran

విషయం అందరికి తెలిసి సమస్యను సాల్వ్ చేద్దాం అనుకుంటే అప్పటికే చాల దూరం వెళ్లిపోయిందని కుటుంబం అందరు ప్రయత్నించామని కానీ అది కుదరక ఇక వారు విడిపోయారు అంటూ చెప్పుకోచ్చారు సుజిత.తన అన్నయ్య సూర్య కిరణ్ కు తనకు ఎనిమిది ఏళ్ళు వయసు తేడా ఉండటం, చిన్న తనం లోనే తండ్రి చనిపోవడం తో తనకు అన్నయ్య నే తండ్రి లాగ ఉన్నాడని, తనకు సూర్య కిరణ్ అంటే చాల భయం కూడా ఉండేదని తెలిపారు.తన పెళ్లి మాత్రం అన్న వదిన ఇద్దరు దగ్గర ఉండి చేసారు అని విడిపోయి ఆమె ఎక్కడ ఉన్న తనకు ఆమె పై గౌరవం ఉంటుంది అని చెప్పారు.

ఇదేందయ్యా ఇది : చితికి మంటపెట్టగానే చనిపోయిన వ్యక్తి ఇలా చేశాడేంటి?
Advertisement

తాజా వార్తలు