అంతరిక్షంలోకి ఫ్రీగా వెళ్ళాలని అనుకుంటున్నారా.. ఇలా ఫాలో అయిపోండి..!

అంతరిక్షంలో విహరించాలని ప్రతి ఒక్కరు కలలు కంటారు.కానీ కొంతమంది కలలు మాత్రమే నేరవేరతాయి.

మరికొంతమంది కలలు కలగానే ఉండిపోతాయి.ఎందుకంటే డబ్బులు ఉన్నవాళ్లు మాత్రమే రోదసిలో తిరిగి రావడానికి అవకాశాలు ఉన్నా ఈ కాలంలో మరి సామాన్య ప్రజల సంగతి ఏంటి ఒకసారి ఆలోచించండి.

వాళ్ళకి కొన్ని ఆశలు ఉంటాయి కానీ ఆ ఆశలను నెరవేర్చుకోవాలంటే అందుకు తగిన డబ్బులు వాళ్ళ దగ్గర ఉండవు.అయితే ఇప్పుడు సామాన్య ప్రజల కల నెరవేరనుంది.

వాళ్ళు కూడా అంతరిక్షంలో తిరిగే రోజులు వస్తున్నాయి.అయితే అది ఎలా సాధ్యం.

Advertisement

రోదసీలోకి వెళ్ళాలంటే పెద్ద చదువులు చదివిన వ్యోమగామిలు మాత్రమే వెళతారు కదా మరి సామాన్య ప్రజలు ఎలా వెళతారు అనుకుంటున్నారా కానీ అదృష్టం ఉంటే ఉచితంగానే రోదసిలో ఎంచక్కా తిరిగి రావొచ్చు.అది ఎలా అంటే లక్కీ డ్రాలో విజేతగా నిలవాలి మరి.

అలా లక్కీ డ్రాలో విజేత అయిన వారు మాత్రమే ఉచితంగా అంతరిక్షంలో విహరించవచ్చు.అసలు ఇలాంటి లక్కీ డ్రాలు ఆఫర్ చేసే స్పేస్ కంపెనీలు జాబితా ఒకసారి పరిసిలిద్దామా.

అలాగే, డబ్బులు తీసుకొని కూడా అంతరిక్షంలో విహరింపచేసే కంపెనీల ఏంటో ఒక లుక్ వేద్దామా.మీకు వర్జిన్‌ గెలాక్టిక్‌ లక్కీ డ్రా గురించి తెలిసే ఉంటుంది.

దీని స్థాపకుడు రిచర్డ్‌ బ్రాన్సన్‌. అయితే అయిన వర్జిన్‌ గెలాక్టిక్‌ పేరుతో 2 టికెట్లను ఉచితంగా ఇచ్చేందుకు ఒక లక్కీ డ్రా నిర్వహిస్తోంది.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
మరో అనారోగ్య సమస్యకు గురైన సమంత... ఎమోషనల్ పోస్ట్ వైరల్!

ఈ లక్కీ డ్రాలో విజేతగా వచ్చిన ఒక వ్యక్తికి రెండు టికెట్స్ ను ఇచ్చేస్తారు.అయితే గెలిచిన వ్యక్తి తనకి ఇష్టం అయిన వ్యక్తిని తనతో పాటు అంతరిక్షంలోకి తీసుకుని వెళ్ళవచ్చు.

Advertisement

ఇది ఇలా ఉంటే వర్జిన్‌ గెలాక్టిక్‌ ఏజెన్సీ మొదటి కమర్షియల్ ఫ్లైట్ ని 2022లో అంతరిక్షంలోకి తీసుకుని వెళ్లే ప్రయత్నాలు చేస్తుంది.అయితే లక్కీ డ్రా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమయింది.

సెప్టెంబర్ 1 నాటికి లక్కీడ్రా ప్రక్రియ ముగియనుండగా సెప్టెంబర్ 29న ఆ విజేత ఎవరో ప్రకటిస్తారు.ఈ లక్కీ డ్రాలో మన ఇండియన్స్.

కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు.అలాగే మరొక లక్కీ డ్రా ఏంటంటే జారెడ్ ఇస్సాక్‌మాన్ లక్కీ డ్రా.

ఈ స్పేస్‌ ఎక్స్ సంస్థకి కస్టమర్ అయిన ఇస్సాక్‌మాన్ తో పాటు ఆ అంతరిక్ష నౌకలో ఉన్న రెండు సీట్లలో పిల్లల క్యాన్సర్ ఆసుపత్రి నుంచి వచ్చిన ఇద్దరు అంతరిక్షయానం చేస్తారని తెలిపారు.అలాగే మూడవ సీటులో ఇస్సాక్‌మాన్ కూర్చుంటారు.

ఇక మిగిలిన నాలుగవ సీట్ కోసం ఒక లక్కీడ్రా నిర్వహిస్తున్నారు.

అలాగే నాసా, ఆక్సియం స్పేస్ కంపెనీ యాక్స్-1 పేరిట ప్రవేటు వ్యోమగాములను ఆకాశంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యింది.అయితే ఇందుకోసం అంతరిక్షంలో పయనించాలంటే వ్యోమగాములు 55 మిలియన్ డాలర్లు చెల్లించి సీట్ బుక్ చేసుకోవాలి.ఈ యాత్రకు సంబంధించి అన్ని టికెట్స్ అయిపోయాయి.వచ్చే ఏడాది జనవరి 2022లో అంతరిక్షంలోకి వెళ్లనుంది.

డియర్ మూన్ ప్రాజెక్ట్ కేవలం భూమి చుట్టూ మాత్రమే కాకుండా చంద్రుని చుట్టూ కూడా తిరిగి రావచ్చు మేజావా స్పేస్‌ఎక్స్‌ తో కలిసి ఒక అద్భుతమైన మిషన్ ద్వారా చంద్రుని చుట్టూ తిరిగి రావచ్చు.ఈ ఆఫర్ కేవలం మనీ కట్టిన వాళ్ళకే.

కానీ త్వరలోనే ఈ ప్రాజెక్టు ద్వారా సామాన్య ప్రజలు సైతం చంద్రుని చుట్టూ తిరగేసి వచ్చే అవకాశం ఉందట.

తాజా వార్తలు