జిల్లాలో మంత్రి కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ పర్యటన....

రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ రాష్ట్ర ఎస్సీ, గిరిజన, బిసీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి ఈ నెల 6 (గురువారం) న సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా ఈ క్రింది కార్యక్రమాల్లో పాల్గొంటారు.

పర్యటన వివరాలు :

ఉదయం 11 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో చిన్న తరహా కుటీర వ్యాపారం చేసుకునే 128 మంది లబ్ధిదారులకు ఆర్ధిక సాయం అందజేస్తారు.ఉదయం 12 గంటలకు బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా తంగళ్లపల్లి మండలం, జిల్లెల వ్యవసాయ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పిస్తారు.

ఉదయం 12:30 గంటలకు జిల్లెల్ల వ్యవసాయ కళాశాల ఆవరణంలో పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 1650 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేస్తారు.అనంతరం వారితో కలిసి భోజనం చేస్తారు.

మధ్యాహ్నం 3 గంటలకు మనోజ్ తండ్రి ఇటీవల మరణించిన నేపథ్యంలో బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో వారి నివాసానికి వెళ్లి మనోజ్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.

Advertisement
మిస్సింగ్ అయిన బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన వేములవాడ టౌన్ పోలీసులు..

Latest Rajanna Sircilla News