స్టార్ హీరోలకు కూడా ఇలాంటి బుకింగ్స్ లేదు.. దుమ్ములేపుతున్న 'ఈ నగరానికి ఏమైంది' రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్

ఈమధ్య కాలం లో రీ రిలీజ్ ట్రెండ్ మన టాలీవుడ్ లో ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

స్టార్ హీరోల అభిమానులు తమ అభిమాన హీరో కొత్త సినిమా విడుదల అయ్యేటప్పుడు ఎంత హంగామా అయితే చేస్తారో.

ఈ రిలీజ్ సినిమాల విషయం లో కూడా అలాగే చేస్తుంటారు.ప్రస్తుతం ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన సినిమాలలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రం గా పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రం( Kushi Movie ) నిల్చింది.

ఆ తర్వాత రీసెంట్ గా విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి ( Simhadri ) చిత్రం అత్యధిక వసూళ్లను సాధించి ఆల్ టైం టాప్ 2 చిత్రం గా నిల్చింది.ఈ రెండు సినిమాల తర్వాత రామ్ చరణ్ ఆరెంజ్, పవన్ కళ్యాణ్ జల్సా మరియు మహేష్ బాబు ఒక్కడు చిత్రాలు టాప్ 5 లిస్ట్ లో కొనసాగుతున్నాయి.

ఈ సినిమాలన్నీ స్టార్ హీరోలవి కాబట్టి వాళ్ళ అభిమానులు చూస్తారు కాబట్టి అంత వసూళ్లు వచ్చాయి అని అనుకుందాం.

Advertisement

కానీ ఎలాంటి స్టార్ కాస్టింగ్ లేని సినిమా ఈ నగరానికి ఏమైంది( Ee Nagaraniki Emaindi Movie ) అనే చిత్రాన్ని ఎల్లుండి గ్రాండ్ గా మరోసారి రీ రిలీజ్ చెయ్యబోతున్నారు.ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ రీసెంట్ గానే ప్రారంభించారు.తరుణ్ భాస్కర్ దర్శకత్వం లో విశ్వక్ సేన్( Vishwak Sen ) హీరో గా నటించిన ఈ సినిమా అప్పట్లో పెద్ద యూత్ ఫుల్ హిట్ గా నిల్చింది.

ఇప్పటికీ ఈ సినిమా ని బోర్ కొట్టినప్పుడల్లా ఓటీటీ లో చూస్తూనే ఉంటారు జనాలు.అలాంటి కల్ట్ క్లాసిక్ స్టేటస్ దక్కించుకున్న ఈ సినిమాకి ఇప్పటికీ ఎంత క్రేజ్ ఉందో, ఒక్కసారి బుక్ మై షో యాప్ ని ఓపెన్ చేసి చూస్తే అందరికీ అర్థం అవుతుంది.

ముఖ్యంగా హైదరాబాద్ సిటీ లో ఈ సినిమాకి జరుగుతున్న బుకింగ్స్ ని చూసి ట్రేడ్ పండితులు సైతం మెంటలెక్కిపోతున్నారు.టికెట్స్ ఓపెన్ చేసిన నిమిషాల వ్యవధి లోనే హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోతున్నాయి.

మరో విశేషం ఏమిటంటే ఈ సినిమా విడుదలైన పక్క రోజే పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా కూడా రీ రిలీజ్ అవ్వబోతుంది.ఆ చిత్రానికి కూడా మంచి అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి కానీ, ఈ నగరానికి ఏమైంది రేంజ్ బుకింగ్స్ మాత్రం జరగడం లేదు.అదే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

అయితే ఈ నగరానికి ఏమైంది అనే చిత్రం బక్రీద్ పండుగ రోజు విడుదల అవుతుంది, కానీ పవన్ కళ్యాణ్ తొలిప్రేమ చిత్రం మాత్రం మామూలు వర్కింగ్ డే లో విడుదల అవుతుంది.అందుకే అంత తేడా ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Advertisement

అయితే ఈ రేంజ్ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్, ఎన్టీఆర్ సింహాద్రి రీ రిలీజ్ కి గాని, మహేష్ బాబు ఒక్కడు చిత్రం రీ రిలీజ్ కి కానీ జరగలేదని చెప్తున్నారు ట్రేడ్ పండితులు.చూడాలి మరి ఈ చిన్న సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకెన్ని అద్భుతాలు సృష్టించబోతుందో రీ రిలీజ్ లో.

తాజా వార్తలు