యంగ్ హీరో విశ్వక్ సేన్ సోషల్ మీడియాలో ఈ మధ్య తెగ హడావుడి చేస్తున్నాడు.చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా వచ్చిన పేరు ఎక్కువే.
ఈయనకు వచ్చిన క్రేజ్ కు వివాదాలు కూడా ఒక కారణం అంటూ సినీ వర్గాల వారు అంటూ ఉంటారు.షూటింగ్స్ సమయంలో అతడి అటిట్యూడ్ మరియు ప్రవర్తన గురించి ప్రముఖంగా చెప్పుకుంటూ ఉంటారు.
ఆ మధ్య ఇండైరెక్ట్ గా విజయ్ దేవరకొండతో సున్నం పెట్టుకున్న విశ్వక్ సేన్ ఇప్పుడు మరో సారి ఒక సంగీత దర్శకుడితో వివాదం పెట్టుకున్నాడు.ఈ విషయం లో ప్రస్తుతం పెద్ద ఎత్తున వివాదం రాజుకుంటుంది.
ప్రముఖ నటి నటులు కూడా వివాదాలకు భయపడుతూ ఉంటే విశ్వక్ సేన్ మాత్రం ఎవరైతే నాకు ఏంటి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

సంగీత దర్శకుడితో ఉన్న వివాదం గురించి విశ్వక్ సేన్ ను ఎవరైనా సన్నిహితులు ప్రశ్నించగా అదో చిన్న విషయం అన్నట్లుగా చెబుతున్నాడు.ప్రస్తుతం విశ్వక్ సేన్ ఇండస్ట్రీలో ఎదుగుతున్న హీరో.ఇలాంటి సమయంలో ఆయన ఇలా దూకుడుగా వ్యవహరించడం మంచిది కాదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.