భారత్ లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెటర్ గా విరాట్ కోహ్లీ.. ఆర్మాక్స్ మీడియా నివేదిక..!

ఆర్మాక్స్ మీడియా నివేదిక ప్రకారం 2023లో భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడాకారుల జాబితాలో భారత జట్టు స్టార్ బ్యాట్స్మెన్, రన్ మిషన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు.భారత జట్టు వన్డే ప్రపంచ కప్ గెలవకపోయినా భారత జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును విరాట్ కోహ్లీ ( Virat Kohli )గెలుచుకున్నాడు.

ఈ జాబితాలో భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రెండవ స్థానంలో ఉన్నాడు.2020లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన మహేంద్ర సింగ్ ధోనీకి సోషల్ మీడియా ఖాతాలో చాలామంది ఫాలోవర్లు ఉన్నారు.ఈ జాబితాలో రోహిత్ శర్మ( Rohit Sharma ) మూడవ స్థానంలో నిలిచాడు.

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ఛాంపియన్ గా నిలబెట్టాడు.రోహిత్ శర్మకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉండడం వల్ల ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలిచాడు.

భారత జట్టు వన్డే ప్రపంచ కప్ గెలవకపోయినా విరాట్ కోహ్లీ మాత్రం మంచి ప్రజాదరణ పొందాడు.వన్డే ప్రపంచ కప్ ( ODI World Cup )11 మ్యాచ్లలో విరాట్ కోహ్లీ 765 పరుగులు చేశాడు.బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్( New Zealand ) జట్లపై సెంచరీలు చేశాడు.

Advertisement

వన్డే ప్రపంచ కప్ 2023లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ రెండవ స్థానంలో నిలిచాడు.వన్డే ప్రపంచ కప్ 2023 టైటిల్ ను త్రుటిలో మిస్ చేసుకున్న భారత్ 2024 టీ20 ప్రపంచ కప్ గెలవాలని ఆరాటపడుతోంది.

అందుకోసం ఇప్పటినుంచే అన్ని ఫార్మాట్లలో భారత ప్లేయర్లు తమదైన శైలిలో రాణించే ప్రయత్నం చేస్తున్నారు.భారత జట్టు దూకుడు చూస్తుంటే కచ్చితంగా టీ20 ప్రపంచ కప్ 2024 టైటిల్ ను భారత్ సొంతం చేసుకుంటుంది అనుకోవడంలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు.

Advertisement

తాజా వార్తలు