వైరల్ వీడియో: తప్పిపోయిన కుక్క అర్ధరాత్రి ఇంటికి వచ్చి..?!

ప్రస్తుత రోజులలో చాలా మంది ఇళ్లల్లో పెంపుడు జంతువులను పెంచుకోవడం సర్వసాధారణం అయిపోయింది.

ఈ క్రమంలో  చాలా మంది కుక్కలు, పిల్లలను ఇంట్లో పెంచుకుంటూ వారి సొంత కుటుంబ సభ్యులకు చూసుకుంటూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం.

అయితే కొన్ని కొన్ని సందర్భాలలో కుక్కలు తప్పిపోయి చాలా రోజుల తరబడి తప్పిపోయిన అనంతరం మళ్ళీ ఇంటికి చేరుకోవడం మనం గమనిస్తూనే ఉంటాం.అయితే తాజాగా ఒక తప్పిపోయిన కుక్క చాలా రోజుల అనంతరం తనంతట తానే ఇంటికి వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

అంతే కాకుండా సాధారణంగా ఎవరైనా ఇంటికి వచ్చిన సమయంలో కాలింగ్ బెల్ ఎలా మోగిస్తారో  అచ్చం అలాగే తప్పిపోయిన కుక్క కూడా అలానే  కాలింగ్ బెల్  కొట్టింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

సహజంగా జంతువులు ఇళ్లలో నుంచి తప్పిపోయి చాలా రోజుల అనంతరం వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి.అయితే అచ్చం మనిషి ప్రవర్తించినట్లు కుక్క కూడా ప్రవర్తించడం నెటిజన్స్ ను  ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Advertisement

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.సౌత్ కరోలినా లో 23 సంవత్సరాలు గల మేరీ లైన్ అనే మహిళ తాను పెంచుకుటున్న కుక్క కొద్దిరోజుల కిందట ఇంటి నుంచి తప్పిపోవడం జరిగింది.

అప్పటి నుంచి ఆ కుక్క కోసం వెతకని ప్రదేశమే లేదు.అంతేకాకుండా కుక్క ఓనర్ తన ఫేస్బుక్ ద్వారా కూడా కుక్క సంబంధించి పోస్టులు కూడా పెట్టింది.

ఎంత వెతికిన కూడా దొరకని కుక్క అనుకోకుండా ఒక రోజు అర్ధ రాత్రి మూడు గంటల సమయంలో ఇంటికి రావడమే కాకుండా, గేట్ ముందు లోపలికి వెళ్లేందుకు కాలింగ్ బెల్ మోగించింది.అర్ధరాత్రి సమయం లో కాలింగ్ బెల్ మోగగానే ముందుగా ఎవరు వచ్చారో అనే అనుమానంతో సిసిటివి పరిశీలించగా తలుపు దగ్గర కెమెరా ముందు ఉన్న కుక్క కనిపించింది ఈ సందర్భంగా సదరు యజమాని మాట్లాడుతూ డోర్ బెల్ మోగింది ఆ కుక్కకు మేము ఎప్పుడూ నేర్పించలేదు అంటూ తెలియజేసింది.

వీడియో వైరల్ : అసలు బుద్ది ఉందా లేదా.. రీల్స్ కోసం ఇలా అవసరమా..
Advertisement

తాజా వార్తలు