వీడియో: హార్దిక్ పాండ్య దురుసు ప్రవర్తనతో అంతా షాక్.. అమ్మాయిలైతే ఇలాగే ప్రవర్తిస్తావా..?

టీమ్ ఇండియాలో అతి తక్కువ మంది ఆల్రౌండర్లలో ఒకడైన హార్దిక్ పాండ్య ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు.

ఫామ్ కోల్పోయి టీమిండియా జట్టులో అత్యంత పేలవమైన ఆట ప్రదర్శనతో విమర్శల పాలవుతున్నాడు.

ఈ నేపథ్యంలోనే అతడు తలపొగరుతో ఒక పని చేసి నెటిజన్లతో చివాట్లు పెట్టించుకుంటున్నాడు.ఒక అభిమానితో పాండ్య దురుసుగా ప్రవర్తించడమే ఇందుకు కారణం.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.వివరాల్లోకి వెళితే.

ఇటీవల హార్దిక్ పాండ్య అతడి సోదరుడు కృనాల్ పాండ్యతో కలిసి ముంబైలోని బాంద్రాలో కాసేపు గడిపాడు.ఈ క్రమంలోనే వీరిద్దరూ ఒక క్లినిక్ నుంచి బయటకు వస్తూ జనాల కంట పడ్డారు.

Advertisement
Viral Video Team India Cricketer Hardik Pandya Shocking Behavior Details, Hardik

దాంతో చాలామంది అభిమానులు పాండ్యని చూసి ఆశ్చర్యపోయారు.వెంటనే సెల్ఫీలు ఇవ్వాల్సిందిగా కోరారు.

అందుకు ఓకే అన్న పాండ్య సెల్ఫీలు ఇవ్వడం ప్రారంభించాడు.ఈ సందర్భంలోనే ఒక అభిమాని భుజంపై చేయి వేసి సెల్ఫీ దిగాలి అనుకున్నాడు.

కానీ ఆ ఫ్యాన్ తన భుజంపై చేయి వేయగానే పాండ్య చాలా చిరాగ్గా ఫీల్ అయ్యాడు.వెంటనే ఆ అభిమాని చేతిని తన భుజంపై నుంచి గట్టిగా పక్కకి తోసేసాడు.

పక్కనే ఓ అమ్మాయి ఉండగా ఆ అమ్మాయితో మాత్రం నవ్వుతూ ఫొటో దిగాడు.ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.

Viral Video Team India Cricketer Hardik Pandya Shocking Behavior Details, Hardik
ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
ఇదేందయ్యా ఇది : చితికి మంటపెట్టగానే చనిపోయిన వ్యక్తి ఇలా చేశాడేంటి?

అయితే పాండ్య తన అభిమాని చేతిని కిందికి తోసేస్తున్నప్పుడు తీసిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.ఒక అభిమాని పట్ల ఇలా దురుసుగా ప్రవర్తించడం ఏమాత్రం బాగోలేదని ఇతర అభిమానులు సైతం అతడిపై ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు.మరీ ఇంత పొగరు అవసరమా పాండ్య? అదే నీ పై అమ్మాయి చేయి వేస్తే అలానే విసిరికొట్టే వాడివా? అని నెటిజన్లు అతన్ని ఏకిపారేస్తున్నారు.ఇదిలా ఉండగా వెన్నుముక శస్త్ర చికిత్స తర్వాత పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తున్నాడు పాండ్య.

Advertisement

సౌతాఫ్రికా జట్టుకు తనని ఎంపిక చేయొద్దంటూ స్వయంగా హార్దిక్ పాండ్యనే అభ్యర్థన పెట్టుకోవడం అందరినీ ఆశ్చర్య పరిచిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు