వైరల్ వీడియో: మాస్క్ లు పెట్టుకోమని బాలుడు ఎంత చెబుతున్నా పట్టించుకోని జనం.. చివరకు..?!

కరోనా అందర్నీ అతలాకుతలం చేసేసింది.ఇకపోతే కరోనా సెకండ్ వేవ్ చాలా మందిని పొట్టనపెట్టుకుంది.

ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.దీంతో జనం బయటకు వస్తున్నారు.

ఇప్పుడిప్పుడే షాపింగ్ మాల్స్, గ్రౌండ్స్ అన్నీ తెరుచుకుంటున్నాయి.ఈ తరునంలో ఇప్పుడు మూడో వేవ్ తో రానుందని నిపుణులు చెప్పడంతో ప్రజలకు మరో షాక్ తగిలినట్లైయ్యింది.

కరోనా నుంచి కాపాడుకోవాలని ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను హెచ్చరిస్తున్నాయి.అందుకే అందరూ మాస్కును విధిగా ధరించాలని వేడుకుంటున్నారు.

Advertisement

అయినా కొంతమంది మాత్రం మాస్కు వేసుకోకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు.దీని వల్ల వారితోపాటుగా పక్కవారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్న సంఘటనలు చాలానే చూస్తున్నాం.

తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దేశ వ్యాప్తంగా అన్ లాక్ ప్రక్రియతో అన్ని కార్యకలాపాలు తెరుచుకున్నాయి.

దీంతో హిమాచల్ ప్రదేశ్ లో పర్యాటక స్థలాలు పర్యాటకులతో ఫుల్ బిజీగా అయ్యాయి.హోటల్స్ కూడా తెరుచుకున్నాయి.

అలాగే హిమాచల్ ప్రదేశ్ లో సిమ్లా, మనాలీ, ధర్మశాల, డల్ హౌసీ, నార్కండ లాంటి ప్రఖ్యాత టూరిస్టు ప్రాంతాలు కూడా జనాలతో కిక్కిరిసి పోయాయి.అక్కడంతా పర్యాటకుల తాకిడి ఎక్కువయ్యింది.

వైయస్సార్ బీమా పథకం పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం..!!
వీడియో వైరల్ : అసలు బుద్ది ఉందా లేదా.. రీల్స్ కోసం ఇలా అవసరమా..

అంతా బాగానే ఉన్నా కానీ, పర్యాటకులు మాత్రం సేఫ్టీ రూల్స్ ను పాటించడం లేదు.మాస్క్ లు లేకుండా తిరుగుతూ పక్కవారిని కూడా ప్రమాదంలోకి తోసేస్తున్నారు.

Advertisement

ధర్మశాలలో ఓ బాలుడు పర్యాటకులను మాస్కులు పెట్టుకోవాలంటూ కర్ర పట్టుకుని చెప్పడం చేశాడు.

అయితే పర్యాటకులు మాత్రం నవ్వుతూ వెళ్లి పోతున్నారే తప్ప మాస్కులను మాత్రం పెట్టుకోవడం లేదు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.వీడియోను చూసిన వారు తెగ నవ్వుకుంటున్నారు.

అంతేకాకుండా నెటిజన్లు పర్యాటకులను టార్గెట్ చేసి దారుణంగా కామెంట్లు పెడుతున్నారు.బాలుడు చేసిన పనికి శభాష్ అంటున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

తాజా వార్తలు