వైరల్ వీడియో: క్రికెట్ మక్కాలో నాగిని డాన్స్ తో రెచ్చిపోయిన కోహ్లీ..!

క్రికెట్ అంటే ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా ఆడడంతో పాటు చూస్తారు కూడా.

మ్యాచ్ మొదలు అయితే చాలు టీవీలకు అతుక్కుని పోతారు ఇప్పటికీ చాలా మంది.

ప్రజల్లో అంత క్రెజ్ ఉంది మరి క్రికెట్ ఆటకి.అయితే అసలు క్రికెట్ ఆటకు గుర్తింపు లభించింది లార్డ్స్ గ్రౌండ్ లోనే.

అందుకే లార్డ్స్ గ్రౌండ్ మైదానం అంటేనే అందరూ ప్రత్యేకంగా చూస్తారు.ఒకపక్క మైదానంలో ఆటగాళ్లు ఆట ఆడుతుంటే లార్డ్స్ బాల్కనీలో నిలబడి ప్రతి ప్లేయర్ కూడా ఆటను చూస్తూ ఆనందపడుతుంటారు.

ఇప్పుడు మన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అలానే లార్డ్స్ బాల్కనీలో నిలబడి ఆట చూస్తూ తెగ ఎంజాయ్ చేసాడు.అక్కడితో ఆగలేదండోయ్ నాగిని స్టెప్స్ వేసి అక్కడ ఉన్న అందరిని ఆశ్చర్యపరిచారు.

Advertisement

ఇప్పుడు కోహ్లీకి సంబందించిన ఈ నాగిని డాన్స్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.లార్డ్స్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండో మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోభారత బ్యాట్స్మెన్స్ ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కొవడం చూసి ఆనందంతో లార్డ్స్ బాల్కనీలో విరాట్ కోహ్లీ తోటి ఆటగాళ్లు అయిన కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, మయాంక్ అగర్వాల్ తో సహా జట్టులోని కొంతమంది సభ్యులతో కలిసి హంగామా చేసాడు.అలాగే కోహ్లీ నాగినీ డ్యాన్స్ చేస్తున్నట్లు ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి.

ఆ ఫోటోలు చూసిన అభిమానులకు వెంటనే భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గుర్తుకు వచ్చారు.ఎందుకంటే అప్పట్లో గంగూలీ కూడా ఇదే లార్డ్స్ మైదానంలో మ్యాచ్ గెలిచిన తర్వాత ఆనందంతో ఒంటిమీద ఉన్న చొక్కా విప్పి గిరగిరా తిప్పుతూ హంగామా చేసాడు.మళ్ళీ ఇదే తరహాలో కోహ్లీ కూడా ఇలాగే హంగామా చేసాడు.

అయితే నెటిజన్లు మాత్రం కోహ్లీ మీద సెటైర్లు వేస్తున్నారు.ఇ దే ఉత్సహం పరుగులు తీయడంలో చూపించు అని కామెంట్స్ చేస్తున్నారు.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
చిరంజీవి విలన్ గా బాలీవుడ్ నటుడు..  మేకర్స్ పోస్ట్ వైరల్!

ఎందుకంటే కోహ్లీ రెండో ఇన్నింగ్స్ లో కేవలం 20 పరుగులకే ఔట్ అయ్యాడు.అయితే ఎట్టకేలకు లార్డ్స్ లో ఇంగ్లాండ్ పై టీమ్ ఇండియా జట్టు విజయం సాధించడంతో భారత అభిమానులకు పండుగల మారిపోయింది.

Advertisement

తాజా వార్తలు