వైరల్: నాటు నాటు పాటకు కొత్త పెళ్లికూతురు చిందులేసింది.. అంతే, దెబ్బకు మోతమోగింది!

ఇండియన్ దర్శక దిగ్గజం రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజై ఎలాంటి ప్రభంజనాలు సృష్టించిందో ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు.మార్చి 25న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది.

రామ్ చరణ్, NTR కలిసి నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1125 కోట్ల పైగా వసూళ్లు సాధించి, రికార్డులకెక్కింది.ఈ క్రమలో ఈ సినిమాలోని ప్రత్యేకించి పాటల గురించి మాట్లాడుకోవాలి.

ప్రముఖ సంగీత దర్శకుడు MM కీరవాణి ఇచ్చిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఎసెట్ అని చెప్పుకోవాలి.ఈ సినిమాలో వచ్చే ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయ్యాయి.

ముఖ్యంగా నాటు నాటు పాటను ప్రస్తావించాలి.ఈ పాట వీడియో ఇటీవల రిలీజ్ చేయగా అది మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ లో దుమ్ము దులుపుతోంది.

యూట్యూబ్ షార్ట్స్, టిక్ టాక్, ఇన్స్టా రీల్స్ అని తేడా లేకుండా ఈ పాటను ఇమిటేట్ చేస్తూ అనేకమంది యూజర్స్ స్టెప్పులు వేస్తూ, తమ అకౌంట్లలో పోస్ట్ చేస్తున్నారు.ఈ క్రమంలో అనేకమంది వీడియోలు సోషల్ మీడియాలలో తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజాగా అలాంటి ఓ వీడియో చూపరులను ఎంతగానో ఆకట్టుకొని వైరల్ అవుతోంది.నాటు నాటు పాటకు తాజాగా ఓ కొత్త పెళ్లి కూతురు అద్భుతంగా డ్యాన్స్ చేసి, ఔరా అనిపించింది.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.ఈ వీడియోలో పెళ్లి కూతురు సహా కొందరు అమ్మాయిలతో కలిసి నాటు నాటు పాటకు కాళ్ళు కదిపారు.అందరికంటే ఈ అందమైన పెళ్లి కూతురు నాటు నాటు పాటకు అదిరిపోయే రీతిలో డ్యాన్స్ చేసి పెళ్ళికొడుకు సైతం ఉలిక్కిపడేలా చేసింది.

దాంతో సదరు వీడియోని తమ ఫోన్స్ లలో బంధించి, సోషల్ మీడియాలో అప్లోడ్ చేసారు.కాగా, ఈ పాటలో చరణ్, తారక్ చేసిన స్టెప్పులను అభిమానులు ఇప్పట్లో మర్చిపోలేరు.

అయితే వారికి ఏమాత్రం ఎనర్జీ తగ్గకుండా ఉత్సాహంగా డ్యాన్స్ చేసింది ఈ కొత్త పెళ్లి కూతురు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు