మీ చిన్ననాటి మధుర అనుభవాలు.. ఈ వీడియోతో గుర్తు రావడం ఖాయం

చిన్నతనంలో పాఠశాలకు వెళ్లేటప్పుడే ఎన్నో మధుర స్మృతులు ఉంటాయి.తిట్టుకోవడం, కొట్టుకోవడం, కాసేపటికే కలిసిపోవడం ఇలా ఎన్నో విషయాలు గుర్తుకొస్తాయి.

బడి ఎగ్గొట్టడానికి వర్షం ఓ కారణంగా చూపాలని ఎంతో మంది ప్రయత్నించి ఉంటారు.చివరికి తల్లిదండ్రులతోనూ, బడిలో టీచర్లతోనూ దెబ్బలు తిని ఉంటారు.

అదేంటే కానీ బాగా జోరుగా కురిసే వర్షం కరెక్ట్‌గా బడి వేళకు ఆగిపోయిన ఎన్నో సంఘటనలు అందరికీ ఎదురయ్యే ఉంటాయి.తిట్టుకుంటూనే ఏడుస్తూ చిన్నతనంలో చాలా మంది బడికి వెళ్లుంటారు.

అయితే కొందరు మాత్రం వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ తడుచుకుంటేనే బడికి పరుగులు తీస్తుంటారు.తాజాగా అలాంటి ఓ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది.

Advertisement

దానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.ఇప్పట్లో ఉన్నట్లు ఓ 20 ఏళ్ల క్రితం ప్రైవేట్ పాఠశాలలు లేవు.

అందరూ సర్కారు బడికే వెళ్లేవారు.ఈ పరిస్థితుల్లో వర్షం వచ్చినప్పుడు దానిని ఆస్వాదిస్తూ పరుగులు పెట్టేవారు.

ఇలాంటివి అందరికీ గుర్తుకు వస్తాయి.తాజాగా నెట్టింట ఓ వీడియో వైరల్ అవుతోంది.

ఓ చోట వర్షం వస్తుండగా కొందరు విద్యార్థులు వెళ్తున్నారు.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో జీవన్ రెడ్డి మాల్ రీ ఓపెన్
కళ్లు లేకపోయినా మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ పరీక్షలో జాబ్.. ఈమె సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

ఒకే గొడుకు ఉన్నా, అది సరిపోదని తెలిసినా ఓ ఆరుగురు అందులో దూరారు.ఎంతో సంతోషంగా చిరునవ్వులు చిందిస్తూ సగం శరీరం తడుస్తున్నా ముందుకు సాగుతున్నారు.వారి వెనుకే వచ్చిన ఓ వాహనదారుడు వారిని పలకరించి, వీడియో తీశాడు.

Advertisement

దీనిని ట్విట్టర్‌లో షేర్ చేయగా, నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది.చిన్ననాటి విషయాలు గుర్తుకొస్తున్నాయని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

తాజా వార్తలు