పాటలు పాడే చెట్టును ఎక్కడైనా చూశారా? అసలు ఈ తరహా చెట్టు ఉంటుందని ఎప్పుడైనా విన్నారా? ఎహే, పాటలు పాడే చెట్లు ఉండటం ఏంటి? చెవిలో పూలు పెట్టకండి! అని అసహనం వ్యక్తం చేస్తున్నారా? అయితే మీరు ఇంగ్లండ్, లాంకషైర్ కౌంటీ, బర్న్లీ పట్టణంలోని చెట్టు గురించి తెలుసుకోవాల్సిందే.
ఈ చెట్టు గాలి వీచినప్పుడల్లా చెవులకు వినసొంపైన, ఇంపైన పాటలు పాడుతుంది.
రోజంతా ఈ చెట్టు వాయుగీతాలను వినిపిస్తూనే ఉంటుంది.వాయుగీతాలు అంటే గాలి దాని గుండా వెళ్ళినప్పుడు ఆ చెట్టు స్వరాలాపన చేస్తుంటుంది.
ఈ వింతను చూడటానికి అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులు తరలి వస్తున్నారు.అయితే నిజంగా ఇది సహజ వృక్షం అనుకుంటే పొరపాటే.
ఎందుకంటే ఈ వృక్షాన్ని ఉక్కుతో తయారు చేశారు.దాదాపు 10 అడుగులకు పైగా ఎత్తు ఉండే ఈ వృక్షంలో వేణువులాంటి చాలా గొట్టాలు కొమ్మల రూపంలో ఉంటాయి.
ఈ గొట్టాల ద్వారా గాలి ప్రసరించినప్పుడు మనం ఎన్నడూ వినని అద్భుతమైన స్వరధ్వనులు వినిపిస్తాయి.ఈ లోహ వృక్షాన్ని మైక్ టాంకిన్, అన్నాలియు అనే ఇద్దరు లోహశిల్పులు రూపొందించారు.
వారి పుణ్యమాని ఈ జీవంలేని చెట్టు ఇప్పుడు స్వరాలు పలుకుతూ ప్రజలను ఆకట్టుకుంటోంది.పది అడుగుల చెట్టు నుంచి వింత శబ్దాలు వస్తుండటంతో అందరూ అబ్బుర పడుతున్నారు.2016లో బెర్న్లీ పట్టణానికి సమీపంలో ఒక ఖాళీ స్థలంలో ఈ చెట్టు ని ఏర్పాటు చేశారు.దీనికి ద సింగింగ్ రింగింగ్ ట్రీ అని ఒక పేరు కూడా పెట్టారు.
అమోఘమైన శిల్ప నైపుణ్యంతో చెట్టును రూపొందించిన శిల్పులకు 2007లో రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ జాతీయ పురస్కారం కూడా అందజేసింది.ఎంతైనా ఈ అద్భుత ఆలోచనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy