వైరల్: గాలి వీచినప్పుడల్లా పాటలు పాడుతున్న చెట్టు.. అదెలా సాధ్యమంటే..

పాటలు పాడే చెట్టును ఎక్కడైనా చూశారా? అసలు ఈ తరహా చెట్టు ఉంటుందని ఎప్పుడైనా విన్నారా? ఎహే, పాటలు పాడే చెట్లు ఉండటం ఏంటి? చెవిలో పూలు పెట్టకండి! అని అసహనం వ్యక్తం చేస్తున్నారా? అయితే మీరు ఇంగ్లండ్, లాంకషైర్‌ కౌంటీ, బర్న్‌లీ పట్టణంలోని చెట్టు గురించి తెలుసుకోవాల్సిందే.

ఈ చెట్టు గాలి వీచినప్పుడల్లా చెవులకు వినసొంపైన, ఇంపైన పాటలు పాడుతుంది.రోజంతా ఈ చెట్టు వాయుగీతాలను వినిపిస్తూనే ఉంటుంది.

వాయుగీతాలు అంటే గాలి దాని గుండా వెళ్ళినప్పుడు ఆ చెట్టు స్వరాలాపన చేస్తుంటుంది.

ఈ వింతను చూడటానికి అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులు తరలి వస్తున్నారు.అయితే నిజంగా ఇది సహజ వృక్షం అనుకుంటే పొరపాటే.

ఎందుకంటే ఈ వృక్షాన్ని ఉక్కుతో తయారు చేశారు.దాదాపు 10 అడుగులకు పైగా ఎత్తు ఉండే ఈ వృక్షంలో వేణువులాంటి చాలా గొట్టాలు కొమ్మల రూపంలో ఉంటాయి.

ఈ గొట్టాల ద్వారా గాలి ప్రసరించినప్పుడు మనం ఎన్నడూ వినని అద్భుతమైన స్వరధ్వనులు వినిపిస్తాయి.

ఈ లోహ వృక్షాన్ని మైక్‌ టాంకిన్, అన్నాలియు అనే ఇద్దరు లోహశిల్పులు రూపొందించారు.

"""/"/ వారి పుణ్యమాని ఈ జీవంలేని చెట్టు ఇప్పుడు స్వరాలు పలుకుతూ ప్రజలను ఆకట్టుకుంటోంది.

పది అడుగుల చెట్టు నుంచి వింత శబ్దాలు వస్తుండటంతో అందరూ అబ్బుర పడుతున్నారు.

2016లో బెర్న్‌లీ పట్టణానికి సమీపంలో ఒక ఖాళీ స్థలంలో ఈ చెట్టు ని ఏర్పాటు చేశారు.

దీనికి 'ద సింగింగ్‌ రింగింగ్‌ ట్రీ' అని ఒక పేరు కూడా పెట్టారు.

అమోఘమైన శిల్ప నైపుణ్యంతో చెట్టును రూపొందించిన శిల్పులకు 2007లో రాయల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఆర్కిటెక్ట్స్‌ జాతీయ పురస్కారం కూడా అందజేసింది.

ఎంతైనా ఈ అద్భుత ఆలోచనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

లోక్ సభ ఎన్నికలకు టీఎంసీ మ్యానిఫెస్టో విడుదల