వైరల్: గీత రాబరీ కచేరికి అంత డిమాండా? ఒక్క రాత్రిలో రూ.4.50 కోట్ల నోట్ల వర్షం!

సంగీతం రాయిని కదిలించగలదు అని నానుడి.ఇక మనుషులెంత? అవును, నిజమే.

శ్రావ్యమైన సంగీతం వింటే మైమరచిపోతాము.

సంగీతానికి పశు పక్షాదులు సైతం తన్మయత్వంలో మునిగిపోతాయి అంటారు.ఇక మృదుమధరమైన గాయకులు తమ గానంతో కోట్ల మందిని అలరిస్తారు.ఈ క్రమంలో అభిమానులకి ఆరాధ్యులుగా మారిపోతారు అనడంలో సందేహమే లేదు.

ఇకపోతే కొంతమంది సింగర్స్ పాటలకు హర్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు.వారి పాటలు వుంటూ ఆనందంతో ఉప్పొంగిపోతుంటారు.

ఇంకేముంది వారు ఏదైనా స్టేజ్ షో ఇస్తే నోట్ల వర్షం కురిపిస్తుంటారు.

Advertisement

అదేవిధంగా తన పాటలతో కోట్ల మంది హృదయాలను గెల్చుకుంది జానపద గాయని గీతా రాబరి( Folk singer Geeta Rabari ).గీతా రబరీ పాడితే అభిమానులు పూనకాలతో వూగిపోతుంటారు.తాజాగా ఆమె పాడిన పాటకు నోట్ల వర్షం కురిపించారు అభిమానులు.

ఈ ఘటన గుజరాత్ లో చోటు చేసుకోగా సోషల్ మీడియాలో దానికి సంబంధించిన వీడియో ఒకటి తెగ హల్ చల్ చేస్తోంది.వివరాల్లోకి వెళితే.గుజరాత్( Gujarat ) కి చెందిన ప్రముఖ జానపద గాయని గీతా బెన్ రబారీ గురించి మీరు ఎక్కడో ఒకచోట వినే వుంటారు.

ఈమె పాట కోసమే పుట్టారా అన్నంత మధురమైన గానంతో కోట్లమంది సంగీత ప్రియులను అలరిస్తున్నారు.

స్టేజ్ పై ఆమె పాటలు పాడటం మొదలు పెడితే ప్రజలు తన్మయత్వంలో తేలిపోతుంటారు.రాన్ ఆప్ కచ్( Rann of Kutch ) జిల్లాలో తప్పర్ గ్రామంలో జన్మించిన ఈమె 5వ తరగతి వరకు మాత్రమే చదివినా ఆ నాటినుండే జానపద గీతాలు పాడటం మొదలు పెట్టింది.గీతా రాబరి గుజరాతీ భాషలో ఎక్కువగా భజనలు, జానపద పాటలు పాడతారు.ఇకపోతే రాన్ ఆఫ్ కచ్ లో నాందేవి మాత పునర్జన్మను పురస్కరించుకొని బనస్కాంత జిల్లాలో నవచండీ యజ్జం జరిపించ రాత్రంతా సంగీత భజనా కార్యక్రమంలో గీతా రాబారి పాడగా ఈ సందర్భంగా స్టేజ్ పై అభిమానులు ఏకంగా రూ.4 కోట్ల 50 లక్షల నోట్ల వర్షం కురిపించడం విశేషం.

గ్రహశకలాన్ని గుర్తించి అరుదైన ఘనత సాధించిన విద్యార్థి
Advertisement
" autoplay>

తాజా వార్తలు