వైరల్: ఎత్తైన పర్వతం అంచున చిటారుకొమ్మన ఓ అతిధి వుంది... షేర్ చేసిన IAS!

ప్రస్తుతం సోషల్ మీడియా విప్లవం నడుస్తోందని చెప్పుకోవాలి.ఇపుడు మానవుడు ఎలాంటి సమాచారం తెలుసుకోవాలన్నా ఒకే ఒక్క మీడియం ద్వారా తెలుసుకుంటున్నాడు, అదే సోషల్ మీడియా.

 వైరల్: ఎత్తైన పర్వతం అంచున చిట-TeluguStop.com

నిత్యం ఇందులో పలు రకాల వీడియో కంటెంట్, ఇమేజెస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయి.అయితే అందులో ఏ కొన్నో వైరల్ అవుతూ ఉంటాయి.

ఇక అలాంటివి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటాయి.అందులోనూ ముఖ్యంగా జంతువుల సమాచారం అయితే మనవాళ్ళు బాగా ఇష్టపడుతూ వుంటారు.

ఇక తాజాగా ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతున్న ఫోటోని చూస్తే అవాక్కవడం మీ వంతు అవుతుంది.IAS ఆఫీస‌ర్‌ సుప్రియా సాహూ ట్విట్ట‌ర్‌లో షేర్ చేసిన నీల‌గిరి త‌హ‌ర్ ఫొటోలు సోష‌ల్‌ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతున్నాయి.“నిజ‌మైన ఖ‌త్రోం కే ఖిలాడీ.ప‌శ్చిమ క‌నుమ‌ల్లోని షోల ప‌చ్చిక‌బ‌య‌ళ్లలో ఇవి నివ‌సిస్తాయి.

ఎత్తైన కొండ‌ల్ని కూడా ఇవి అవ‌లీల‌గా ఎక్కగలవు.వీటి సంర‌క్ష‌ణ‌కు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ప్రాజెక్టు మొద‌లు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది” అంటూ ఆ ఫొటోల‌కు ఆమె క్యాప్ష‌న్ పెట్టారు.

వైరల్ అవుతున్న ఫొటోలని చూస్తే నీల‌గిరి కొండ‌ల మీదున్న ఒక చెట్టు యొక్క చిటారు కొమ్మ మీద త‌హ‌ర్ ఒక‌టి నిల్చొని ఉండటం గమనించవచ్చు.మ‌రికొన్ని ఆ ప‌క్క‌నే ఉన్న కొండ మీద నిల్చొని ఉండటం గమనించవచ్చు.

అంత‌రించిపోయే ద‌శ‌లోని జంతువు ఫొటోలు షేర్ చేసిన త‌మిళ‌నాడు రాష్ట్ర జంతువు అయిన త‌హ‌ర్ అంత‌రించిపోయే ద‌శ‌లో ఉంది.కాగా ఈ జంతువును సంర‌క్షించేందుకు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది.

ఒవిస్ జాతికి చెందిన గొర్రెల‌ను పోలిన వీటి కొమ్ములు వంపు తిరిగి ఉండటం మనం గమనించవచ్చు.అయితే ఇవి ఎక్కువగా నీల‌గిరి అడువుల్లోనే క‌నిపిస్తాయి.ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ ‘ఫోటో అద్భుతం….ఇప్పుడే నేను నా డెస్క్ టాప్ పైన పెట్టుకున్నా’ అని రాసుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube