ప్రస్తుతం చైనా తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా దేశాలలో కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలన్నిటికీ హెచ్చరికలు జారీ చేసింది.2020 నుంచి అమల్లో ఉన్న కోవిడ్ 19 ఆంక్షలు లో సడలింపు తో పాటు పలు కారణాల వల్ల వైరస్ వ్యాపిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది.భవిష్యత్తులో మరిన్ని వేవ్ లు కచ్చితంగా వస్తాయని హెచ్చరిస్తోంది.
ఇప్పటికే 500 కి పైగా ఓమిక్రాన్ సబ్ వేరియంట్ లు వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపింది.చైనాలో తీవ్రస్థాయిలో కేసులు పెరగడంతో అక్కడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి తెలిపారు.
ప్రపంచ దేశాలు కువిట్ ఆంక్షలు ఈ మధ్యలోనే సడలించారు.ఇదే సమయంలో ఓమిక్రాన్ కొత్త వేరియంట్ ప్రజలలో వ్యాప్తి చెందే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తుంది.
ఇంకా చెప్పాలంటే చాలా దేశాల్లో 500 ఒమిక్రాన్ సబ్ వేరియంట్ లు వ్యాప్తి చెందే అవకాశం ఉందని వెల్లడించారు.రాబోయే రోజుల్లో మరిన్ని సబ్ వేరియంటెడ్ వేవ్ లు వచ్చే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా వెల్లడించింది.
కొన్ని వేరియంటెడ్ లకు రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకునే గుణం ఉండడం ఆందోళనకరంగా ఉంది అని పేర్కొంది.

వీటిపై పోరాడేందుకు మన వద్ద సరిపడా మెడికల్ సపోర్ట్ ఉండడం ఉపశమనం కలిగించే అంశం అని చెబుతున్నారు.ప్రజలలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల మళ్లీ కోవిడ్ 19 కేసులు పెరుగుతున్నాయి. చైనా తో పాటు పలు దేశాల్లో వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్యాలకు గురయ్యే వారితో పాటు ఫ్రంట్ లైన్ వర్కర్లకు వాక్సినేషన్ ముందుగా చేయాలి అని డబ్ల్యూ తెలిపింది.
చైనాలో కోవిడ్ 19 ఉధృతి పెరుగుదల తీరు ఆందోళనకరంగా ఉంది అని వెల్లడించింది.వ్యాక్సిన్ తో పాటు తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి చికిత్స అందించడానికి అవసరమైన మందులు, బెడ్లు అందుబాటులో ఉంచుకోవాలని వెల్లడించింది.







