వైరల్: ఆ ఊర్లో 80 శాతం పైగా జనవరి 1న జన్మించారట.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

ప్రపంచంలో ఒకే ముఖాన్ని పోలిన వ్యక్తులు ఏడు మంది ఉంటారని మనం చాలాసార్లు వింటూనే ఉంటాం.

అంతేకాదు అలా ఒకే ముఖం కలిగిన వారు కలిసిన సందర్భాలు కూడా ఎన్నో.

ఇకపోతే ఒకే రోజు పుట్టిన వారు కూడా ఎందరో ఉంటారు.ఒకే రోజు ఒకటే సంవత్సరం పుట్టిన వారు కలుసుకోవడం అంటే చాలా అరుదు.

అయితే ఒకే రోజు పుట్టినరోజు జరుపుకునే వారిని మనం తరచూ చూస్తూనే ఉంటాం.ఇక అసలు విషయంలోకి వెళితే.

భారత్ లోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రయాగ్ రాజ్ ప్రాంతంలో ఉన్న భార గ్రామంలో ఉన్న ప్రజలు దాదాపు 80 శాతం మందికి పైగా జనవరి 12 తారీఖున పుట్టారని రికార్డులు చెబుతున్నాయి.అయితే ఇది నిజమా అని మీరు అనుకోవచ్చు.

Advertisement

దీనికి తార్కాణంగా ఆ ఊరిలోని ప్రజలు వారి ఆధార్ కార్డు తీసుకొని వచ్చి ప్రూఫ్ కూడా చూపిస్తున్నారు.అదికూడా ఎలా అంటే ఒక కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా వారి పుట్టిన రోజులు అన్ని జనవరి ఒకటో తారీఖున ఉండడం విశేషం.

అయితే ఇక్కడ పుట్టిన సంవత్సరం మార్పు ఉండొచ్చు కానీ. పుట్టిన తేదీ నెల మాత్రం జనవరి ఒకటే అని ఉండడం గమనార్హం.

అయితే ఈ విషయం వెనుక ఓ ఇంట్రెస్టింగ్ విషయం దాగి ఉంది.అదేంటంటే.

2010 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు ను తప్పనిసరి చేసిన సమయంలో ఆ ఊరిలోని ప్రజలు 2012 సంవత్సరంలో ఆధార్ కార్డులకు సమాచారాన్ని ఇవ్వడంలో అధికారులు వారి వివరాలను అందజేశారు.ఆ సమయంలో అధికారులు వారి వివరాలను తెలుసుకొని నేపథ్యంలో వారి పుట్టిన రోజు అడగగా చాలామంది ఊరిలో వారి పుట్టిన సంవత్సరాన్ని అంచనా వేసి చెప్పారు కానీ.ఖచ్చితమైన పుట్టిన తేదీని చెప్పుకోలేక పోయారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

దీంతో ఆ ఊర్లో చాలా మంది ప్రజలకి సంవత్సరం వేరుగా ఉన్నా కానీ పుట్టిన రోజులు మాత్రం జనవరి 1న అధికారులు రికార్డు చేశారు.ఇంకేముంది ఊర్లో ఉన్న 80 శాతం మంది ప్రజలు జనవరి ఒకటో తారీకునే పుట్టినట్లు రికార్డులలో నమోదు అయ్యింది.

Advertisement

ఆ తర్వాత కూడా అధికారులు వాటిని మార్చడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని గ్రామస్థులు వాపోతున్నారు.

తాజా వార్తలు