నోటాకే నా ఓటు;అంటూ వైరల్ అవుతున్న క్యాబ్ డ్రైవర్ల ప్రచారం.! వెనకున్న అసలు కథ ఇదే!

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎన్నికల ఫీవర్ నడుస్తుంది.ఒకొక్కరు ఒకో రకంగా ప్రచారం చేస్తున్నారు.

ఎవరి స్టైల్ వారిదే.ఒకప్పుడు నోటుకి ఓటు వివాదం వైరల్ అయ్యింది.

ఇప్పుడు నోటాకె నా ఓటు అంటూ క్యాబ్ డ్రైవర్లు విచిత్రంగా ప్రమోట్ చేస్తున్నారు.తమ సమస్యలు పట్టించుకోని పార్టీలకు ఓటు వేసేది లేదని తెగేసి చెపుతున్నారు.

వివరాలలోకి వెళ్తే.

Advertisement

నాలుగున్నరేళ్లుగా తమ సమస్యలు పరిష్కారం చూపకుండా ఇప్పుడు వచ్చి ఓట్లు అడిగితే తామెందుకు వేస్తామంటూ నోటాకే నా ఓటు అంటూ ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఓలా ,ఉబెర్ కంపనీలు వచ్చిన కొత్తలో ఆకర్షినియమైన పెమెంట్లు , ఇన్సెంటివ్ లు పేరుతో తమని మభ్య పెట్టి కంపనీలు మోసం చేస్తునాయని తెలిపారు.ఈ విషయంపై పోరాటం చేస్తున్నా అటు రాజకీయనాయకులు కానీ ఇటు ప్రభుత్వం గాని పట్టించుకోవట్లేదు.

దీంతో హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్లు వినూత్నంగా నోటాకే నా ఓటు అనే నినాదాన్ని ప్రచారం లోకి తెచ్చారు.నగరం లో లక్ష ఇరవై ఐదు వేల మంది క్యాబ్ డ్రైవర్లు ఉన్నారని , కుటుంబం కి సగటున నాలుగు ఓట్లు వేసుకున్న ఐదు లక్షలు ఓట్లు ఆ ఓట్లు మొత్తం నోటా కే ఓటు వేసే విధంగా తీర్మానం చేశారు.మరి డిసెంబర్ 7 న వీరు నిజంగానే నోటికి వోట్ వేయనున్నారా.? .

Advertisement

తాజా వార్తలు